నువ్వు ఎలాగూ వెళ్లవు… మేం వెళ్తుంటే నొప్పేంటి?.. రేవంత్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.. దీంతో.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. పౌర స్వేచ్ఛను కేసీఆర్ సర్కార్ హత్య చేస్తోందంటూ మండిపడ్డ ఆయన.. ప్రతిపక్ష నేతల ఇళ్లల్లోకి ఖాకీలను ఉసిగొల్పుతున్నాడు అని.. సన్నిహితులు, మిత్రులు, బంధువుల ఇళ్లలో పరామర్శలకు, శుభకార్యాలకు కూడా వెళ్లనీయని నిర్భందకాండకు ఈ దృశ్యం ఉదాహరణగా పేర్కొన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకుపుడుతోందన్న రేవంత్.. మేం ఇంట్లో నుంచి కాలు కదిపితే ఆయన గజగజ వణికిపోతున్నాడు అని వ్యాఖ్యానించారు.
ప్రజా గ్రహం పెల్లుబికిన నాడు నీ ప్రగతి భవన్‌లు, ఫామ్‌హౌస్‌లు బద్ధలైపోతాయి.. జాగ్రత్త కేసీఆర్ అంటూ హెచ్చరించారు రేవంత్‌రెడ్డి.. ఇదేం సంస్కారం కేసీఆర్!?.. అంటూ మండిపడ్డారు.. అర్థరాత్రి నుండి పోలీసులతో ఇంటిని ముట్టడించడం… అనుమతి లేకుండా ఇంటిలోనికి ప్రవేశించడం.. పరామర్శలకు కూడా వెళ్లకుండా నిర్భందించడం… ఇదేనా కేసీఆర్ నీ పాలనా సంస్కారం.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. నీ కుంచిత ఆలోచన. తెలంగాణ భారత రాజ్యాంగ పరిధిలో రాష్ట్రమనుకుంటున్నావా? నీ ప్రైవేటు ఎస్టేట్ అనుకుంటున్నావా? చేతనైతే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు చస్తుంటే… పరామర్శించడం పాపమా..? అని నిలదీసిన ఆయన.. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లల్లో శుభకార్యాలు, పరామర్శలకు వెళ్లి గంటల తరబడి గడుపుతున్న కేసీఆర్… ధాన్యం, మిర్చీ రైతుల చావుకేకలు నీ చెవికి చేరడం లేదా!? అంటూ ప్రశ్నించారు.. పెద్దోళ్ల ఇళ్లల్లో కార్యాలకు వెళతావు కానీ… పేదరైతు కుటుంబాన్ని పరామర్శించే తీరకలేదా!? నువ్వు ఎలాగూ వెళ్లవు… మేం పరామర్శిస్తుంటే నీకొచ్చిన నొప్పేంటి? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేవారు రేవంత్‌రెడ్డి.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!