తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఓ రోజు పెరుగుతూ… ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,187 శాంపిల్స్ పరీక్షించగా… 190 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో కరోనా బాధితుడు మృతి చెందారు. ఇదే సమయంలో 198 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,78,478…
తెలంగాణలో రాబోయే రోజుల్లో విద్యుత్ సంస్థల్ని పటిష్టం చేయనున్నారు. జెన్కో ఆద్వర్యంలో పదివేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో 57 లక్షలకు పెరిగాయి నూతన కనెక్షన్లు. వీటితో పాటు వ్యవసాయరంగంలో 19 నుంచి 26 లక్షలకు పెరిగిన వ్యవసాయ మోటార్ కనెక్షన్లు పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత ఏడేళ్లలో 7778 మెగావాట్ల నుండి 16,6 23 మెగావాట్లకు విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. 26,915 కిలోమీటర్ల EHT విద్యుత్ లైన్లు…
హైదరాబాద్ శివారులోని వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఘోరం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందడం వివాదాస్పదం అయింది. ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళనతో ఉద్రిక్తత ఏర్పడింది. నాదర్ గుల్ కి చెందిన స్వప్న అనే మహిళ నాలుగురోజుల క్రితం పాపకు జన్మనిచ్చింది. పాప ఏడుస్తుందని సిబ్బందికి చెప్పగా సిబ్బంది వచ్చి చూసి వెళ్ళారు. కొద్దిసేపటి తరవాత పాప ఏడుపు ఆపి కళ్ళు మూసుకోవడంతో డాక్టర్ లు వచ్చి పాప చనిపోయింది అని చెప్పారు. ముందే…
కాళేశ్వరం ప్రాజెక్ట్ ముంపు అంశం మళ్ళీ తెరమీదకు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు జాతీయ మానవహక్కుల సంఘం నోటీసులు జారీచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై అధ్యయనం చేసి 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్ హెచ్ ఆర్సీ ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ముంపు అధికంగా ఉందంటూ ఎన్ హెచ్ ఆర్సీకి ఫిర్యాదు చేశారు న్యాయవాది శ్రావణ్. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల ఇటీవల 30 నుంచి 40వేల…
రైతులు చనిపోతే రూ.3 లక్షలు ఇస్తానన్న సీఎం కేసీఆర్..సాయితేజ కి కూడా ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు వి హనుమంతరావు. దేశం కోసం చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా ఇస్తే యువత ఢిపెన్స్ లో చేరేందుకు ముందుకు వస్తారని పేర్కొన్నారు. బిపిన్ రావత్ దగ్గర పనిచేసే సాయితేజ చనిపోయాడు..తాను అయన కుటుంబాన్ని ఇవాళ పరామర్శించానన్నారు. కానీ… దేశానికి సేవ చేసిన సాయితేజ అంత్యక్రియల్లో తెలంగాణ మంత్రి ఒక్కరూ కూడా పాల్గొనలేదనిఫైర్ అయ్యారు. సానియామీర్జా, పివి సింధులకు…
పెట్టుబడులు, అధిక వడ్డీల పేరిట ప్రముఖల దగ్గర కోట్ల రూపాయలు కొట్టేసిన కేసులో శిల్ప చౌదరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. శిల్ప చౌదరి కేసులో ఊహించని షాక్ తగిలింది. శిల్ప చౌదరి కి బెయిల్ నిరాకరించి.. రిమాండ్ విధించింది ఉప్పర్ పల్లి కోర్టు. ఈ కేసులో 2 రోజుల పాటు ఎక్సటెన్షన్ కస్టడీ కోరుతూ కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు నార్సింగి పోలీసులు. అదే సమయంలో… శిల్ప చౌదరి కూడా బెయిల్ పిటీషన్…
దేశంలోనే వైద్యరంగంలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రమని మరోసారి రుజువైంది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా రెండు కేటగిరీల్లో తెలంగాణ చాంపియన్ గా నిలిచింది. తద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో తెలంగాణ వైద్య రంగం పటిష్టమైందని మరోసారి చాటి చెప్పింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం “హెల్దీ అండ్ ఫిట్ నేషన్” క్యాంపెయిన్ ను ప్రారంభించింది. నవంబర్ 16 తేదీ నుండి డిసెంబర్ 13 వరకు జరిగిన ఈ క్యాంపెయిన్ లో సబ్…
నారాయణపేటలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎవరూ ఇవ్వని పథకాలు అందిస్తున్నా అని ప్రగల్భాలు పలుకుతున్న మన సీఎం గారు..రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు కారణం ఎవరు? అని ప్రశ్నించారు. మన సీఎం ఎలా ఫీల్ అవుతున్నారంటే ఒక చక్రవర్తిలా ఊహించుకుంటున్నారు. నాలుగేళ్ళ నుండి రైతుల జీవితాలతో ఆటలాడుతున్నారు సీఎం. ఒకసారి పత్తి అంటాడు ఒకసారి సన్న వడ్లు అంటాడు కానీ రైతులకు లాభం రాలేదు. సన్న వడ్లు పండించిన వారికి ఐదు…
తెలంగాణలో పేదింటి ఆడపిల్లల కుటుంబాలకు ఆసరాగా ఉండాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మీ పథకంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 45 ఏళ్ల కిందట వివాహమైన ముగ్గురు వృద్ధులకు కళ్యాణలక్ష్మీ పథకం డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. సిరికొండ మండలానికి చెందిన 67 ఏళ్ల శకుంతలబాయి అనే మహిళకు రెండుసార్లు, 65 ఏళ్ల సుమన్బాయి అనే మహిళకు మూడుసార్లు వారి బ్యాంకు ఖాతాలో కళ్యాణలక్ష్మీ ఆర్థిక సాయం…
తెలంగాణ గ్యాంగ్స్టర్గా చెలామణి అయిన నయీం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘నయీం డైరీస్’ చిత్రానికి హైకోర్టులో చుక్కెదురైంది. నయీం డైరీస్ మూవీలో అసభ్యకర దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారురాలు బెల్లి లలిత కుటుంబసభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అభ్యంతకర సన్నివేశాలు తొలగించేవరకు సినిమా ప్రదర్శన నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. Read Also: ఫ్యామిలీతో రజినీకాంత్ బర్త్ డే సెలెబ్రేషన్స్… పిక్స్ వైరల్ అయితే…