మేడ్చల్ ఐటీఐ కళాశాల తరలింపుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. అయితే తమ ఐటీఐ కళాశాల తరలించకుండా చర్యలు తీసుకోవాలని సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మకు 132 విద్యార్థుల లేఖ రాసారు. తమ కళాశాలని తరలించి భూమిని కంపెనీలకు కేటాయించేందుకు కసరత్తు జరుగుతోందని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ విద్యార్థుల లేఖను సుమోటో పిల్ గా స్వీకరించింది సీజే ధర్మాసనం. ఆ ఐటీఐ కళాశాల తరలిస్తే పేద, మధ్యతరగతి విద్యార్థులు ఇబ్బంది పడతారని తెలిపింది హైకోర్టు.…
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తెలంగాణలో అడుగు పెట్టేసింది.. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిపోయింది.. మరో వ్యక్తికి ఒమిక్రాన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.. అయితే, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు.. ఒమిక్రాన్ కేసులో హైదరాబాద్‌లో వెలుగుచూసిన సందర్భంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఒమిక్రాన్ రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులతో పాటు.. విదేశాల నుంచి…
క్రమంగా ప్రపంచాన్ని చుట్టేసే పనిలో పడిపోయింది కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఇప్పటికే భారత్‌లో పలు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగు చూడగా.. ఇప్పుడు తెలంగాణను కూడా తాకింది. నిన్నటి వరకు భారత్‌లో 37 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఏపీలోనూ ఒక కేసు వెలుగుచూసింది.. ఇప్పుడు తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.. అయితే, మరో వ్యక్తికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ రావాల్సి ఉందని చెబుతున్నారు.. కెన్యా,…
నచ్చిన హోటల్‌కి వెళ్లి.. మెచ్చిన ఫుడ్ తిన్న తర్వాత.. సంతృప్తి చెందితే.. ఎవరైనా అక్కడి వెయిటర్‌కి టిప్పుగా కొంత డబ్బు ఇస్తుంటారు.. హోటల్, రెస్టారెంట్ రేంజ్‌ని బట్టి టిప్పు పెరిగిపోతుంటుంది.. కొందరు ఇవ్వకుండా వెళ్లిపోయేవారు కూడా లేకపోలేదు.. అయితే, టిప్పు ఇవ్వలేదని ఓ యువకుడిని వెయిటర్ చితకబాదిన ఘటన శంషాబాద్‌లో వెలుగు చూసింది.. Read Also: రూ.3,520 కోట్లకు చేరిన ‘కార్వీ’ మోసం.. 5 వేల పేజీలతో ఛార్జీషీట్.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్‌లోని ఎయిర్పోర్ట్ బావార్చిలో…
తెలంగాణలో థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా వున్నామన్నారు వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు. 21 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్దం చేయాలని ఆదేశించారు. ప్రపంచ వ్యాప్త కరోనా పరిస్థితుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సౌకర్యం సిద్దం చేయాలన్నారు. ప్రజలు మాస్కులు ధరించాలి, రెండు డోసుల వాక్సిన్ తీసుకోవాలని హరీష్ రావు సూచించారు. కరోనా తాజా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు.…
టీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పెద్దల సభకు నామినేటెడ్ అయ్యారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనా చారి ఎన్నికయినట్టు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి పేరును కేబినెట్ ఆమోదించి.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కి పంపించారు. ఆమె ఆమోదించడంతో ఎమ్మెల్సీగా ఎన్నికయినట్టు గెజిట్ విడుదల చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా తనను ఎంపిక చేసినందుకు మధుసూదనాచారి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు. వారు నాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు.…
కాంగ్రెస్ పోటీ చేసిన రెండు స్థానాల్లో మాకు ఉన్న ఓట్ల కంటె ఎక్కువే వచ్చాయి. కాబట్టి భట్టి విక్రమార్క , జగ్గారెడ్డి విజయం సాధించారు అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. టీఆర్ఎస్ ఓట్లు మాకు వచ్చాయి అంటే.. టీఆర్ఎస్ పై వ్యతిరేకత కనిపిస్తుంది అన్నారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచినా..నైతికంగా ఓడిపోయింది. నల్గొండలో అభ్యర్థిని పెట్టకపోయినా..ఇండిపెండెంట్ అభ్యర్థికి మా పార్టీ వారు ఓటేసారు. స్థానిక సంస్థల పట్ల టీఆర్ఎస్ వ్యతిరేక దోరణి..…
నల్గొండ స్వత్రంత అభ్యర్థి నగేష్ ఎంపీ కోమటిరెడ్డిపై సంచలన కామెంట్లు చేసారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ని ప్రకటించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుగురు స్వత్రంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నాం. నేను కాంగ్రెస్ కి చెందిన జెడ్పీటీసీని… అయినా నాకు ఓటు వెయ్యవద్దని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఓటర్లకు చెప్పారు అని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ కి సపోర్ట్ చేశారు. ఆయన వల్లే…
ఎన్నికల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు సర్వ సాధారణమైన విషయం.. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఛాలెంజ్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. తన పంతం నెగ్గించుకున్నారు.. కాంగ్రెస్ అభ్యర్థికి 230 కంటే తక్కువ ఓట్లు వస్తే తన పదవికి రాజీనామా చేస్తానని గతంలో సవాల్ చేసిన ఆయన.. ఈ రోజు వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలకు 238 ఓట్లు రావడంతో తన పంతం నెగ్గించుకున్నారు.. జగ్గారెడ్డి…
నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది తెలంగాణ హైకోర్టు.. 226 మంది ఉపాధ్యాయుల పిటిషన్‌పై సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ జరిపింది.. రాష్ట్రపతి ఉత్తర్వులతో పాటు, గతంలోని కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా జీవోలు ఉన్నాయని పిటిషనర్లు వాదించారు.. అయితే, ఈ వ్యవహారంలో ప్రభుత్వ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.. ఇదే సమయంలో నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు…