ప్రభుత్వం ప్రెంఢ్లీ పోలీసింగ్, ప్రెండ్లీ సర్వీస్ అంటూ అన్ని శాఖల్లో పారదర్శకత, ఉండాలని ప్రజలకు మెరుగైనా సేవలను అందించాలని పదే పదే చెబుతున్నా అక్కడక్కడ అధికారుల తొందరపాటు చర్యలకు సామాన్యులు బలి అవుతున్నారు. తాజాగా కమర్షియల్ టాక్స్ అధికారుల అత్యుత్సాహానికి డీసీఎం డ్రైవర్ మృతి చెందిన సంఘటన భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. స్క్రాప్ లోడ్‌తో గుంటూరు నుంచి గజ్వేల్ వెళ్తున్న డీసీఎం డ్రైవర్ నబీలాల్‌ను అధికారులు ట్యాక్స్ డబ్బులు కట్టాలని ఒత్తిడి చేసి కొట్టడంతో డ్రైవర్…
తెలంగాణలో రైతుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం నాటకలాడుతోందని మండిపడ్డారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ అనుబంధ సంఘాలన్నిటితో సమావేశం జరిగిందని, ఈ రోజు డిజిటల్ మెంబర్షిప్ తో పాటు భూ వివాదాలపై పాదయాత్ర పై చర్చించాం అన్నారు మహేష్ కుమార్ గౌడ్. భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్ర లోని సేవాగ్రాం వరకు పాదయాత్ర జరగనుంది. జనవరి 30 నుంచి పాదయాత్ర ను మీనాక్షి నటరాజన్ చేయనున్నారు. ఈ పాదయాత్ర లో ఒక్క రోజు…
అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు టైమ్ చూసి ఝలక్ ఇస్తున్నారట పార్టీ నేతలు. నిరసనలు చేపడితే ఒక్కరు కనిపించడం లేదు. ముందురోజు వస్తామని చెప్పినవాళ్లే తర్వాతిరోజు పత్తా లేకుండా పోతున్నారట. ప్రస్తుతం ఆ జిల్లాలో ఆ ఎమ్మెల్యే.. అక్కడి కార్యకర్తల తీరుపైనే గులాబీ శిబిరంలో ఓ రేంజ్లో చర్చ జరుగుతోంది. పార్టీ శ్రేణుల తీరు ఎమ్మెల్యేకు అంతుచిక్కడం లేదా? బిగాల గణేష్ గుప్త. నిజమాబాద్ అర్బన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే. పార్టీకి బలం.. బలగం భారీగానే ఉన్న ఈ నియోజకవర్గంలో…
సీఎం కేసీఆర్ పై మరోమారు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. గడిచిన 70 రోజుల్లోనే రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని…ఇవి ఆత్మహత్యలు కావు, కేసీఆర్ చేసిన హత్యలని నిప్పులు చెరిగారు. కేసీఆర్ రైతులను ఆత్మహత్యలు చేసుకునేలా దిగజారుస్తున్నాడని…ఆయన కు రైతుల ఉసురు తగులుతుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అన్నాక ముందుచూపు ఉండాలని…. ఎందుకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడో అర్థం కావడం లేదని ఫైర్ అయ్యారు. రుణమాఫీ చేసి ఉంటే ఈ రైతులు బతికేవారని… పరిపాలన చేతకాక…
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మరోలేఖ రాశారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి… ఈసారి ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. ఇంటర్ విద్యార్థులకు పాస్ మార్కులు వేయాలని కోరిన ఆయన.. విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు తేవొద్దని.. ఇది రాష్ట్రానికి మంచిది కాదని విజ్ఞప్తి చేశారు.. విద్యార్థుల జీవితాలతో చెలగాటం అడొద్దు అంటూ సీఎం దృష్టికి తీసుకెళ్లిన జగ్గారెడ్డి.. కనీస మార్కులు వేసి అందరినీ పాస్ చేయాలని కోరారు.. ఈ విషయంపై విద్యార్థులు…
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు రైతుల పక్షాన ఢిల్లీ వచ్చారని… మంత్రులను కలిసేందుకు సమయం లేదు.. కానీ, బీజేపీ నేతలను మాత్రం కలుస్తారా? అని నిలదీశారు. రాజకీయం చేస్తున్నది బీజేపీ పార్టీ అని హరీష్‌రావు మండిపడ్డారు. మంత్రులను పట్టుకొని పనిలేదని అంటారా? ఎంత ప్రాధాన్యత ఉంటే ఆరుగురు మంత్రులు ఢిల్లీకి…
తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది.. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.. ఒక, సాయంత్రం నుంచి చలి వణికిస్తోంది.. విశాఖ ఏజెన్సీలో రెండేళ్ల తర్వాత కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. దీంతో విపరీతంగా చలితీవ్రత పెరిగిపోయింది.. పొగమంచుకు శీతల గాలులు తోడవ్వడంతో ఏజెన్సీ ప్రాంతాలు వణికిపోతున్నాయి.. ఈ సీజన్లో లంబసింగిలో జీరో డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. ఇక, ఇవాళ పాడేరు, అరకులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు…
తెలంగాణలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఎట్ రిస్క్ దేశాల నుంచి 726 మంది శంషాబాద్ విమానాశ్రాయానికి చేరుకున్నారని, వారదందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.దీంతో వారి శాంపిల్స్‌ను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 9,122 మంది ప్రయాణికులు వచ్చారు.…
ఏపీలో గడిచిన 24 గంటల్లో 27,233 శాంపిల్స్‌ను పరీక్షించగా 95 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో ఏపీలో ఇప్పటివరకు మొత్తం 20,75,974 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఒకరు (కృష్ణా జిల్లా) మరణించగా ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 14,481కి చేరింది. నిన్న 179 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 20,60,061 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇంకా 1,432 కరోనా కేసులు యాక్టివ్‌గా…
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను మల్టీజోనల్ క్యాడర్ కేటాయింపులో భాగంగా రూపొందించిన సినియార్టీ జాబితాల్లోని లోపాలను సవరించి ఖచ్చితంగా జాబితాను రూపొందించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం డీయస్ఈ శ్రీదేవసేన తన కార్యాలయంలో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలను తెలియజేయాలని కోరారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. రాత్రి 12.00గంటలకు…