పులి చర్మం అమ్మేదుకు ప్రయత్నం చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు ములుగు జిల్లా పోలీసులు. పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం మేరకు ఛత్తీస్‌ఘడ్ నుండి పులి చర్మాన్ని తెలంగాణలో అమ్మేందుకు ముఠా బయలు దేరింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేస్తుంటే రెండు బైక్స్ పైన వస్తున్న ఐదుగురిని గుర్తించి తనిఖీలు చేస్తే పులి చర్మం బయటపడింది. ఇది నిజమైందో కాదో తెలుసుకునేందుకు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అది నిజమైన పులి చర్మం అని…
విద్యుత్ బకాయిల వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాలకు మోడీ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. విద్యుత్ బకాయిల చెల్లింపు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్నవివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున ఆ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలుగు రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు ఇంధన శాఖ మంత్రి ఆర్కె సింగ్ వెల్లడించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ తెలంగాణ 6,111 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని, కేంద్ర జోక్యం చేసుకుని…
రైతుల పాలిట యముడిలా సీఎం కేసీఆర్ తయారయ్యారని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో పంట కొనుగోళ్లలో జాప్యం,అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతు మల్లయ్య కుటుంబాన్ని ఇవాళ వైఎస్ షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఏఒక్క నాయకుడూ ఆదుకోలేదని.. బోర్లు వేసుకున్న రైతులకు వైఎస్ ఆర్ ఎంతో చేశారని… పదవుల్లో ఉన్న తండ్రీకొడుకులు ఏం చేసినట్టు? అని నిలదీశారు. రైతు…
ఆ పదవుల భర్తీపై టీఆర్ఎస్ తేల్చుకోలేకపోతుందా..? ఒకసారి జిల్లా అధ్యక్షుల నియామకం చేయాలని.. మరోసారి జిల్లాకు కోఆర్డినేటర్ల నియామకం సరిపోతుందని ఎందుకు భావిస్తోంది? జిల్లాస్థాయిలో గులాబీపార్టీ ఎందుకు ఆచితూచి అడుగులు వేస్తోంది? అప్పట్లో జిల్లా అధ్యక్షుల నియామకంపై టీఆర్ఎస్లో చర్చ..! జెండా పండుగతోపాటు పార్టీ సంస్థగత నిర్మాణాన్ని మొదలు పెట్టింది టీఆర్ఎస్. గ్రామ, మండల, మున్సిపాలిటీలలో పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తయింది. పార్టీ నిర్మాణంలో భాగంగా జిల్లా అధ్యక్షులను నియమించాలని గులాబీ పెద్దలు అభిప్రాయపడ్డారు. గతంలోనే జిల్లాస్థాయిలో…
తెలంగాణ జిల్లాలు, సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ములుగు జిల్లాలో ఓ మాజీ సర్పంచ్ ని కిడ్నాప్ చేశారు మావోయిస్టులు. దీంతో కలకలం రేగింది. వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కురుసం రమేష్ ని మావోయిస్టులు అపహరించుకుపోయారు. నిన్న సాయంత్రం చర్లకు వెళ్తుండగా రమేష్ ని కిడ్నాప్ చేశారు మావోయిస్టులు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో తీవ్ర ఆందోళన చెందుతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు.…
కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు.. ఉద్యోగుల బదిలీలు ఉన్నాయా? తెలంగాణ సాధించుకున్నామన్న సంతోషం ఆవిరై.. కొత్త సమస్యను తలెకెక్కించుకున్నామనే భావనలో ఉద్యోగులు ఉన్నారా? ఇంతకీ కొత్త జోనల్ విధానం ఉద్యోగులకు వరమా.. శాపమా..? ఉద్యోగులకు అన్యాయం జరగకూడదన్న ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోవడం లేదా? తెలంగాణలో కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టుల విభజన కొందరికీ వరంగా, మరికొందరికి శాపంగా మారింది. ఇదే అదునుగా కొందరు అధికారులు పారదర్శకతకు పాతరేస్తూ అయిన వారిని అందలం ఎక్కిస్తున్నారనే ఆరోపణలు…
ధాన్యం కొనుగోళ్ల అంశం పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ వైఫల్యమని పీయూష్ గోయల్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రైతులకు టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు భ్రమలను కల్పిస్తోందని… కేంద్ర ప్రభుత్వ పరంగా రైతులకు భరోసా ఇస్తున్నామన్నారు. తప్పుడు సమాచారం నమ్మవద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. గత రబీ సీజన్ లో ఇచ్చిన హామీ మేరకు ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేయలేక పోయిందని ఆగ్రహించారు. అవసరం లేకపోయినా, ప్రత్యేక కేసుగా పరిగణించి, 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయల్డ్…
30 లక్షలు టార్గెట్. ఆ అంకె వినగానే గుండె గుభేల్ మన్నా.. సవాల్‌గా తీసుకుని టార్గెట్ చేరుకోవాలని అనుకున్నారు నాయకులు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి రివర్స్. చీమ కుట్టినట్టు అయినా లేదట. పార్టీ చేపట్టిన కార్యక్రమానికి ఊ అంటారో.. ఊహూ అంటారో కూడా తెలియని పరిస్థితి ఉందట. సభ్యత్వం నమోదు కోసమే 30 మందికి శిక్షణ..! కొత్త నాయకత్వం రాగానే సభలు.. సమావేశాలు అని ఊదరగొట్టిన తెలంగాణ పీసీసీకి 30 లక్షల సభ్యత్వం నమోదును లక్ష్యంగా పెట్టింది…
తెలంగాణలో దక్షిణాఫ్రికా కరోనా వేరియంట్ ఒమిక్రాన్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈనెల 16న దుబాయ్ నుంచి స్వగ్రామం గూడెంకు వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ లక్షణాలు కనిపించడంతో వెంటనే హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. టెస్టులు నిర్వహించగా అతడికి ఒమిక్రాన్ పాజిటివ్ అని నిర్ధారించారు. దీంతో వైద్యులు బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. Read Also:…