నిర్మాణ రంగంలో ఇప్పటికే ఎన్నో మైలురాళ్లు అందుకున్న మైహోమ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావును ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఆయనకు గురువారం నాడు తెలంగాణ క్రెడాయ్ సంస్థ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందజేసింది. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ సౌందరరాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా జూపల్లి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం జూపల్లి రామేశ్వరరావు మాట్లాడుతూ… హైదరాబాద్ నగర ప్రగతిలో కన్స్ట్రక్షన్…
రైతులకు అన్యాయం చేయడంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయంటూ మండిపడ్డారు మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. కనీస మద్దతుధర కల్పించడంలో కేంద్రం బాటలోనే రాష్ట్రం పోతోందని విమర్శించిన ఆయన.. కనీస మద్దతు ధర విషయంలో స్పస్టత ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో దోపిడీ జరుగుతుందని ఆరోపించారు జీవన్‌రెడ్డి.. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 5 శాతం.. 3 లక్షల మెట్రిక్ టన్నులు మిల్లర్లే దోపిడీ చేస్తున్నారని..…
ఆ ఇద్దరూ గతంలో ఒకరిపై ఒకరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ సమయంలో రాజకీయం ఓ రేంజ్లో సాగేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ యుద్ధానికి కొంత విరామం వచ్చింది. ఇప్పుడు ఇద్దరూ ఒకే సభలో సభ్యులు. వారి మధ్య పాత పొలిటికల్ వార్ మళ్లీ మొదలవుతుందా? ఇద్దరి మధ్య పాత పొలిటికల్ వార్ కొత్తగా మొదలవుతుందా? ఎల్. రమణ. మొన్నటి వరకు టీడీపీ తెలంగాణ చీఫ్. హుజురాబాద్ ఉపఎన్నిక ముందు సైకిల్ దిగి.. టీఆర్ఎస్…
కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించాలి. వ్యవసాయ రంగంను వ్యాపార రంగంగా చూడకూడదు అని మంత్రి హరీష్ రావు అన్నారు. అయితే కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం 7వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన హరీష్ రావు మాట్లాడుతూ… దేశానికి అన్నం పెడుతూ.. కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం వ్యవసాయ రంగం. అటువంటి వ్యవసాయంను దండగ అనే స్థితి నుంచి కేసీఆర్ నేడు పండుగగా మార్చారు. పదేళ్ల క్రితం గంజీ కేంద్రాలను పెట్టిన…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రంపంచదేశాలను వణికిస్తోంది.. భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మహమ్మారి.. తెలంగాణలోనూ వెలుగు చూసింది.. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి తెలంగాణలో అడుగుపెట్టిన ఒమిక్రాన్ ఇప్పుడు టెన్షన్ పెడుతోంది.. క్రమంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతూ పోతున్నాయి.. ఓవైపు డెల్టా వేరియంట్ కేసులు పూర్తిస్థాయిలో తగ్గిపోకముందే.. ఇప్పుడు ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది.. అయితే, ఒమిక్రాన్ కట్టడికి క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ…
సింగరేణిలో వరుస ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి… తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామగుండం పరిధిలోని సింగరేణి ఆర్జీ 3లోని ఓసీపీ-1లో ఈ రోజు ఉదయం ప్రమాదం జరిగింది. డంపర్‌ను మరో డంపర్ ఢీకొట్టిన ప్రమాదంలో.. ఆపరేటర్ శ్రీనివాస్ మృతి చెందాడు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న సింగరేణి అధికారులు.. అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు…
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో మరో 14 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరింది. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 14 మందికి కరోనా నిర్ధారణ జరిగినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. కేసులు పెరిగిపోతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే మాస్క్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. మాస్క్ లేకుంటే భారీ జరిమానాలు విధిస్తున్నారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా అవసరమైతే నైట్…
ఇప్పటికే కరోనా ఎప్పటికప్పుడు తన రూపం మార్చుకుంటూ ఒమిక్రాన్, డెల్టా వేరింయంట్ల రూపంలో టెన్షన్ పెడుతుంటే మరోవైపు తెలంగాణలో కొత్త వ్యాధి విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో స్ర్కబ్ టైఫస్ అనే వ్యాధి బారిన పడ్డవారు ఏకంగా 15మంది చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెలలో నలుగురు చిన్నారులు ఆస్పత్రుల్లో చేరారని ఇప్పటికే ఇద్దరికి వ్యాధి నయమైందని అధికారులు వెల్లడించారు. ఈ వ్యాధి ఎక్కువగా చిన్నారుల్లో కనిపిస్తుందని వైద్యులు పేర్కొన్నారు. ఈ వ్యాధికి సంబంధించి…
ఆ జిల్లాలోని ముఖ్య నేతలంతా కేరాఫ్ హైదరాబాద్. అధికార, ప్రతిపక్ష పార్టీలనే తేడా లేదు. అందరు నాయకులదీ అదే తీరు. ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన నేతలు.. స్థానిక ప్రజలకు దూరంగా ఉంటున్నారట. దీంతో ప్రజలకు.. వాళ్లు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు మధ్య గ్యాప్ వస్తుందని టాక్. ఇంతకీ ఏంటా జిల్లా? నాయకులు ఎందుకు జిల్లాలో ఉండటం లేదు? రెండేళ్లుగా ప్రజలకు దూరంగా ప్రజాప్రతినిధులు..! ఉమ్మడి కరీంనగర్ జిల్లా. రాజకీయ చైతన్యం ఎక్కువే. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి కాకలు తీరిన…