ఆయన ఎప్పుడు ఏ గట్టున ఉంటారో తెలియదు. ఇప్పటివరకు ఏ పార్టీలోనూ కుదురుగా లేరు. ఇప్పుడు కొత్త గూటికి చేరారు. అక్కడ ఎన్నిరోజులు ఉంటారో.. ఏమో? ఎందుకు పదే పదే కండువా మార్చేస్తున్నారు?ఆయనే గట్టు రామచంద్రరావు. ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన.. గతంలో కమ్యూనిస్ట్. లెఫ్ట్ పార్టీల హవా నడిచిన సమయంలో సీపీఎం నాయకుడిగా గళం వినిపించేవారు. 2008లో CPM నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించి సంచలనం రేపారు. అక్కడ నుంచి ఆయన పరిస్థితి ఎక్కే గుమ్మం దిగే…
దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఓమిక్రాన్ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే రోజూవారీ కేసుల సంఖ్య పెరిగింది. గతంలో 10వేల కన్నా దిగువగా ఉండే కేసులు ప్రస్తుతం 30 వేలకు పైగానే నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. జనాలు కరోనా నిబంధనలు పాటించేలా హెచ్చరిస్తున్నాయి ప్రభుత్వాలు. తాజాగా కరోనా ప్రభావం న్యాయ వ్యవస్థపై కూడా పడుతోంది. కరోనా వ్యాప్తి కారణంగా తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం…
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నగరంలో బీజేపీ క్యాండిల్ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో జేపీ నడ్డా కూడా పాల్గొననున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు. Read Also: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ కీలక భేటీ అయితే జేపీ నడ్డా ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మీసేవా నిర్వాహకుడు రామకృష్ణ ఆత్మహత్య ఘటన చర్చనీయాంశంగా మారింది. ఆస్తి వివాదాల కారణంగా భార్యా పిల్లలతో సహా రామకృష్ణ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మీ సేవా నిర్వాహకుడు రామకృష్ణతో పాటు అతడి భార్య లక్ష్మీ, కూతూరు సాహిత్య సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో రామకృష్ణ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. Read Also: శ్రీహరికోటలో కరోనా కలకలం… 14 మందికి పాజిటివ్…
తెలంగాణలో చలి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే పలుచోట్ల తక్కువ స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున అత్యల్పంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారిలో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు చలి అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగుజాగ్రత్తలు వహించాలని వారు సూచించారు. Read Also: బీ అలర్ట్… దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది మరోవైపు…
రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు బుధవారం నుంచి బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ తెలిపింది. పంపిణీ వ్యవస్థకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముందు శనివారానికి బదులుగా మంగళవారం నుంచి పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో బుధవారం నుంచి పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రతి నెల 1వ తేదీ లేదా 2వ తేదీ నుంచి రేషన్ బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. Read Also: మరిన్ని…
★ శ్రీశైలంలో నేటి నుంచి సర్వదర్శన వేళలు పెంపు… సాయంత్రం 6:30 గంటల నుంచి 7:30 గంటల పాటు సర్వదర్శనం… గతంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు సర్వదర్శనం… తాజాగా సాయంత్రం గంటపాటు సర్వదర్శనం పెంపు… ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉచిత సర్వదర్శనం అమలు★ నేడు, రేపు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులతో చంద్రబాబు సమావేశాలు… అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలపై చర్చ★…
తెలంగాణలో కరోనా కేసులు, ఒమిక్రాన్ కేసులు కలవరం కలిగిస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. తెలంగాణలో 274 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదు కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో 84 కేసులకు చేరింది. ఇప్పటివరకూ ఒమిక్రాన్ నుంచి 32మంది కోలుకున్నారని వైద్యాధికారులు తెలిపారు. తెలంగాణలో 3779 కరోనా యాక్టివ్ కేసులు వున్నాయి. మొత్తం 21,679 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 274 మందికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. మరోవైపు తెలంగాణలో కేసుల తీవ్రత…
ఈ మధ్యే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన గట్టు రామచంద్రరావు… ఇవాళ వైఎస్ షర్మిల సమక్షంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో జాతీయ పార్టీలు ప్రత్యామ్నాయం కావని.. టీఆర్ఎస్కి వైఎస్సార్ తెలంగాణ పార్టీనే ప్రత్యామ్నాయంగా చెప్పుకొచ్చారు.. వైఎస్ షర్మిల చేస్తున్న పోరాటం.. బీజేపీ, కాంగ్రెస్‌లు చేయడం లేదన్న ఆయన.. తెలంగాణలో వైఎస్సార్ లెగసీ ఎక్కడకు పోలేదన్నారు.. వైఎస్సార్ కి జిరాక్స్ కాపిలా వైఎస్ షర్మిల కనిపిస్తున్నారు.. మహిళలకు ప్రాధాన్యత షర్మిల…
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు.. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు.. ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317కు వ్యతిరేకంగా… కొన్ని నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్ తలపెట్టిన దీక్షను భగ్నం చేసి.. ఆయనను ఆదివారం రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కాగా.. ఇవాళ కోర్టులో హాజరు పర్చారు.. అయితే, బండి సంజయ్ కోసం ఫోన్ చేశారు బీజేపీ జాతీయ…