ఎలాంటి కష్టం వచ్చినా.. ప్రశ్నిస్తామన్న ఆ ఎమ్మెల్సీలు.. కీలక సమయంలో ఏమయ్యారు? టీచర్లు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదు? కొత్త జోనల్ విధానంపై తప్పించుకుని తిరుగుతున్నారా? ఎవరా ఎమ్మెల్సీలు? జీవో 317కు వ్యతిరేకంగా టీచర్ల ఆందోళన..!కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయ కేటాయింపుల ప్రక్రియను మొదలు పెట్టింది తెలంగాణ సర్కార్. చకచకా పనులు చేసుకుంటూ వెళ్తోంది. అలకేషన్‌కు సంబంధించిన 317 జీవోపై ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత ఉంది. వీరిలో టీచర్లు తెగించి రోడ్డెక్కారు.…
తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన ఘనత సాధించింది. బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రాలలో దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం… ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ (ODF) విషయంలో తెలంగాణ 96.74 శాతంతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ తర్వాతి స్థానంలో తమిళనాడు (35.39 శాతం), కేరళ (19.78 శాతం), ఉత్తరాఖండ్ (9.01 శాతం), హర్యానా (5.75 శాతం), కర్ణాటక (5.59 శాతం), ఆంధ్రప్రదేశ్ (4.63 శాతం) ఉన్నాయి. జమ్మూకశ్మీర్, బీహార్,…
సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 10 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. సంక్రాంతి సందర్భంగా ఈనెల 7, 22 తేదీల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈనెల 7, 14వ తేదీల్లో కాచిగూడ-విశాఖపట్నం, 8, 16 తేదీల్లో విశాఖపట్నం-కాచిగూడ, 11న కాచిగూడ – నర్సాపూర్, 12న నర్సాపూర్- కాచిగూడ, 19, 21 తేదీల్లో కాకినాడ టౌన్- లింగంపల్లి, 20, 22 తేదీల్లో లింగంపల్లి – కాకినాడ టౌన్…
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 79కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, ఒమిక్రాన్ నుంచి 27 మంది కోలుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 52 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 317 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,82,215కి చేరింది. ఇందులో…
తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్త పథకం ప్రవేశపెట్టేందుకు టీఎస్ఆర్టీసీ సమాయత్తం అవుతోంది. తెలంగాణలో 12 ఏళ్ల లోపు చిన్నారులందరూ శాశ్వతంగా ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నామని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతారని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరుగుతుందని బాజిరెడ్డి ఆకాంక్షించారు. Read Also: న్యూఇయర్ స్పెషల్: నిమిషానికి…
తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరా ఆరోగ్య ప్రదాయిని అని, ఇందులో పోషక విలువలు అధికంగా ఉన్నాయని, ఆబ్కారీ, పర్యాటక, శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ విషయం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన మైక్రోబయాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ డా. భీమా నేతృత్వంలో జరిగిన పరిశోధనలోనూ తేలిందన్నారు. ఈ సందర్భంగా డా.భీమా తోటి శాస్ర్తవేత్తలు డా. చంద్రశేఖర్, డా. శ్రీనివాస నాయక్ లతో కలిసి మంత్రితో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి శ్రీనివాస్…
సంగారెడ్డి జిల్లాలో కొత్త సంవత్సరం రోజు విషాదం నెలకొంది. జహీరాబాద్ మండలం డిడ్గి వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వచ్చిన కారు అమాంతం అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న దంపతులతో సహా 8 ఏళ్ల చిన్నారి మృతి చెందారు. వీరితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారణ చేపట్టారు. మృతులను…
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు వీసీసజ్జనార్. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రానున్న రోజుల్లో వారందరినీ పర్మినెంట్ ఉద్యోగులుగా పరిగణలోకి తీసుకుంటామన్నారు. సంస్థ అభివృద్ధి చెందితే అందరం బాగుంటామని సజ్జనార్ అన్నారు. Read Also:తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం-గవర్నర్ సంస్థలో పని చేసినన్ని రోజులు సంస్థ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కాగా న్యూఇయర్ రోజు బస్సులో ప్రయాణించే 12ఏళ్లలోపు చిన్నారులకు…
హైదరాబాద్ నగరంలో మరోసారి మందుబాబులు రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మరొకరు బలయ్యారు. గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్ ముందు జరిగిన రోడ్డుప్రమాదంలో ఐటీ ఉద్యోగి నితిన్ మృతి చెందాడు. ఈరోజు తెల్లవారుజామున సైకిల్ తొక్కేందుకు నితిన్ బయటకు వచ్చిన సమయంలో మద్యం మత్తులో కారుతో వెనుక నుంచి శశాంక్ అనే వ్యక్తి ఢీ కొట్టాడు. Read Also: తెలంగాణలో మద్యం అమ్మకాలు.. సరికొత్త రికార్డు ఈ ప్రమాదంలో నితిన్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా……
ఈ నూతన సంవత్సరంలోనైనా కరోనా మహమ్మారి నుంచి విముక్తి లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసిన నందమూరి బాలకృష్ణ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్‌తో మహమ్మారి మరో మారు విజృంభిస్తున్న వేళ అందరూ మరింత బాధ్యతతో మెలుగుతూ పూర్తి శక్తి సామర్థ్యాలతో రోగులకు సేవలు అందేలా…