మళ్లీ కరోనా టెన్షన్ పెడుతోంది.. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. మొన్నటి వరకు రెండు వందలకు లోపుగానే నమోదైన పాజిటివ్ కేసులు సంఖ్య ఇప్పుడు రెండు వేల వైపు పరుగులు పెడుతోంది.. ఈ సమయంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక సూచనలు చేసింది.. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగులకు సెలవులను రాబోయే 4 వారాల పాటు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. అదే విధంగా.. రాజకీయ పార్టీలు వచ్చే నాలుగు వారాలు కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని…
పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్ వ్యవహారంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా టాక్ నడుస్తోంది. దీనిపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతన్నల కడుపు మండిందని.. అందుకే వారు ప్రధాని మోదీకి చుక్కలు చూపించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా త్వరలోనే రైతులు బుద్ధి చెప్తారని… ఆ రోజు ఎంతో దూరంలో లేదన్నారు. అధికారం ఇస్తే ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని మరిచిపోయి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాయని షర్మిల మండిపడ్డారు.…
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ క్రమంగా పెరిగిపోతూనే ఉంది.. ఇప్పటికే భారత్‌లో థర్డ్ వేవ్ మొదలైపోయింది.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేవారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. అమెరికాలో నిన్నటి రోజు పది లక్షల కేసులు నమోదయ్యాయి, యూకేలో మొత్తం మూడు లక్షల కేసులు వెలుచూశాయి.. మనదేశంలో కూడా మూడో వేవ్ స్టార్ట్ అయ్యిందన్నారు.. అందులో భాగంగానే నిన్న ఒక్కరోజే 50 వేల కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు.. Read Also: మహిళల ప్రపంచకప్:…
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజుకు దాదాపు వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నాలుగు వారాల పాటు ప్రభుత్వ డాక్టర్లు, నర్సుల సెలవులను రద్దు చేసింది. థర్డ్ వేవ్‌కు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను సిద్ధం చేయాలంటూ ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేసింది. Read Also: ఆశావర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త కాగా తెలంగాణలో మంగళవారం…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.. ఇక, తన ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది.. తన కుటుంబం ఆత్మహత్యకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవయే కారణమనేది రామకృష్ణ చేసిన ప్రధాన ఆరోపణ.. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని.. కానీ, ఏ భర్త కూడా వినగూడని మాట వనమా రాఘవ అడిగారు.. నా భార్యను హైదరాబాద్ తీసుకురావాలని అడిగాడని.. ఆవేదన…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సంచలనం సృష్టించిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకోవడం.. అది బయటకు రావడం.. దానిలోని తమ ఫ్యామిలీ ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ.. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవపై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.. వనమా రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని.. రాఘవ దురాగతాలతో ప్రజలు ఎలా బతకాలి.. అతని…
హైదరాబాద్ నగరంలో మరో డ్రగ్స్ ముఠా ఆట కట్టించారు పోలీసులు, భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది… డ్రగ్స్ ముఠాను నడుపుతోన్న ముంబై మాఫియాని అరెస్ట్ చేశారు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. ముంబై నుంచి హైదరాబాద్‌కు ఆ ముఠా డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా గుర్తించారు.. న్యూ ఇయర్ వేడుకల కోసం హైదరాబాద్‌కు భారీ ఎత్తున డ్రగ్స్ తీసుకొని వచ్చినట్టుగా తెలుస్తుండగా.. ఈ ముఠా నుంచి కొకైన్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలను సీజ్ చేశారు నార్త్ జోన్ టాస్క్…
★ నేడు ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎం జగన్ చర్చలు… తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం★ చిత్తూరు జిల్లాలో నేటి నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన.. కుప్పం మండలం దేవరాజపురం నుంచి పర్యటించనున్న చంద్రబాబు.. నేడు రామకుప్పం మండలంలో చంద్రబాబు రోడ్ షో★ అమరావతి రాజధాని నగరపాలక సంస్థ ఏర్పాటుపై నేడు రెండో రోజు గ్రామసభలు… నేడు కృష్ణాయపాలెం, వెంకటపాలెం, లింగాయపాలెం, ఉద్ధండరాయునిపాలెంలో గ్రామసభలు★ పశ్చిమగోదావరి జిల్లాలో నేటి నుంచి…
కాంగ్రెస్ పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నాలుగు గంటలపాటు కొనసాగింది. జూమ్ ఆప్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్చార్జ్ మానిక్కమ్ ఠాగూర్ అధ్యక్షత వహించారు. కన్వీనర్‌గా షబ్బీర్ ఆలీ సమావేశాన్ని కొనసాగించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు మిగిలిన పీఏసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానిక్కమ్ ఠాగూర్ మాట్లాడుతూ .. పార్టీకి దిశానిర్దేశం చేశారు. ఏఐసీసీ ప్రకటించిన కార్యక్రమాలను కింది స్థాయి నుంచి చేపట్టాలని పిలుపునిచ్చారు. Read Also:పీఆర్సీ పై…
అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ , రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నూతన విద్యాప్రణాళికపై చర్చించనున్నట్టు సునీల్ అంబేకర్ తెలిపారు.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్ఫూర్తి, ప్రేరణతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంస్థల పదాధికారుల సమన్వయ సమావేశాలు జనవరి 5 నుంచి 7 వరకు, 2022 భాగ్యనగర్ శివారు అన్నోజిగూడ జరగనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశాల్లో సంఘచాలక్ డా. మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలేలతో సహా ఐదుగురు సహ కార్యవాహలు, ఇతర ముఖ్య అధికారులు…