రెండు మూడు నెలల క్రితం కురిసిన వర్షాలకు నియోజకవర్గ పరిధిలోని అనేక రోడ్లు ధ్వంసమయ్యాయన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. రవాణా వ్యవస్థ ఇబ్బందికి గురవుతుందని తరుణంలో రవాణా వ్యవస్థ కోసం నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మండలానికి ఒక ప్రతిపాదన పంపాలని సూచనల మేరకు దుబ్బాక శాసన సభ పరిధిలోని ఉన్నటువంటి ఏడు మండలాలను ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వానికి జూలై 17,2021 రోజున ప్రతిపాదనలు పంపడం జరిగింది.
నియోజకవర్గ పరిధిలోని 42 చోట్ల రోడ్లు డ్యామేజ్ అయ్యాయని ప్రతిపాదనలు పంపితే 42 రోడ్లు ఓకే నియోజకవర్గంలో ఇవ్వలేమని ప్రతిపాదనలు తిప్పి పంపారు. మండలంలో ఒకే రోడ్డు ప్రతిపాదన చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సూచనలతో బాగా డామేజ్ అయిన రోడ్లను ఎంపిక చేసి పంపడం జరిగింది. దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని రోడ్ల మరమ్మతులకు మూడు కోట్లు విడుదల చేస్తూ పంచాయతీ శాఖ కమిషనర్ జీవో విడుదల చేశారని తెలిపారు ఎమ్మెల్యే రఘునందన్ రావు.