తెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సోమవారం నాడు మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది. ఈనెల 12 వరకు తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ రిపోర్టు ఆధారంగా నేడు హైకోర్టు విచారణ జరపనుంది. ఈనెల 12 వరకు మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 6.95 పాజిటివిటీ రేటు నమోదైంది. అలాగే జీహెచ్ఎంసీలో 5.65 శాతం పాజిటివిటీ రేటు ఉన్నట్లు అధికారులు…
తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు ప్రకటించారు. ఆన్లైన్ క్లాసులు కంటిన్యూ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, కేసులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నైట్ కర్ఫ్యూను అమలు చేయాలనే అలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. దీనిపై నేడు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతున్నది. ఈ సమావేశంలో…
పీసీసీ మాజీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఈనెల 24న ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతల సమక్షంలో డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సుమారు రెండేళ్ల నుంచి టీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలకు డీఎస్ దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆయన ఢిల్లీలో సోనియాగాంధీతో సమావేశం కావడంతో డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖరారైంది. Read Also: 15 ఏళ్ళ నాటి నిర్లక్ష్యం.. కానరాని పరిష్కారం 2015లో బంగారు తెలంగాణ లక్ష్యంగా డీఎస్…
సంక్రాంతికి నగరం నుంచి వేలాది మంది సొంతూళ్లకు వెళ్లారు. నగరంలో మూడు రోజులపాటు ట్రాఫిక్ రద్దీ చాలా తగ్గిపోయింది. అయితే, సగం నగరం ఖాళీ అయినప్పటికీ సంక్రాంతి వేడుకలు నగరంలో ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి పండగకు రికార్డ్ స్థాయిలో చికెన్ సేల్స్ జరిగింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల వ్యవధిలో రికార్డ్ స్థాయిలో 60 లక్షల కిలోల చికెన్ సేల్స్ జరగింది. సాధారణంగా గ్రేటర్ పరిధిలో రోజుకు 10 లక్షల కిలోల చికెన్…
★ ఏపీలో సంక్రాంతి సెలవుల అనంతరం నేటి నుంచి యథావిధిగా స్కూళ్లు ప్రారంభం★ నేడు కోవిడ్, వైద్య ఆరోగ్య శాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష… ఏపీలో స్కూళ్లకు సెలవుల పొడిగింపు, ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై చర్చించే అవకాశం★ కర్నూలు: కోవిడ్ కారణంగా నేటి నుంచి శ్రీశైలంలో స్పర్శ దర్శనాలు, అన్నప్రసాద వితరణ, పుణ్యస్నానాలు రద్దు★ నేటి నుంచి ఏపీలో మూడు రోజుల పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన.. నేడు ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్‌కు రానున్న వెంకయ్యనాయుడు..…
పదిహేనేళ్ల క్రితం కృష్ణానదిలో మంచాలకట్ట వద్ద నాటుపడవ మునగడంతో 61 మంది జలసమాధి అయ్యారు. నదిపై వంతెన నిర్మిస్తామని అప్పట్లో ప్రభుత్వం హడావుడి చేసినా పనులు మాత్రం శిలాఫలకాలకే పరిమితం అయ్యాయి. దీంతో ప్రమాదం మిగిల్చిన విషాదానికి తోడు పాలకులు నిర్లక్ష్యం స్థానికులను వెక్కిరిస్తోంది. పదిహేనేళ్ల క్రితం జరిగిన విషాదం ఇంకా ఆ ప్రాంతాన్ని వెంటాడుతూనే ఉంది. ప్రస్తుత నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల సందర్భంగా జరిగిన పడవ విషాదం ఇప్పటికీ ఆ…
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 2017లో ఎరువులు ఉచితంగా ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు ఒక్కసారే ఎరువుల ధరలను 50 శాతం పెంచడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. Read Also: జంటనగరాల…
1 దేశంలో కరోనా కేసుల్లో కాస్త పెరుగుదల నమోదవుతూనే వుంది. తాజాగా భారత్‌లో 2 లక్షల 71 వేల కేసులు నమోదయ్యాయి. 16.65 లక్షలమందికి పరీక్షలు నిర్వహించారు. కరోనా కారణంగా 314 మంది మరణించారు. పాజిటివిటీ రేటు స్వల్పంగా తగ్గింది. 16.28 శాతంగా నమోదైంది. గత వారం పాజిటివిటీ రేటు 13.69 శాతంగా వుండేది. భారత్ లో 7,743కు చేరింది ఒమిక్రాన్ కేసుల సంఖ్య. ఏపీలో కరోనా కేసుల్లో పెరుగుదల కొనసాగుతోంది. కొత్తగా 4,570 కోవిడ్ కేసులు…
తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు… మరికొన్ని ప్రాంతాల్లో గాలివానలు భయపెడుతున్నాయి. ఈ వర్షాలకు ఇప్పటికే పంటలు బాగా దెబ్బతిన్నాయి. మరికొన్ని రోజుల పాటు వర్షాలు తప్పవని అధికారులు తెలిపారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దట్టంగా మంచు కురిసే వేళలో అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ వానలు పడుతున్నాయి. అకాలంలో పడుతున్న ఈ వర్షాలు… రైతులకు అపార నష్టాన్ని మిగిలుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర…
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతరల సీజన్ మొదలైంది. ఇంటి ఇలవేల్పులకు మొక్క చెల్లించేందుకు పెద్దఎత్తున భక్తులు జాతరలకు వెళ్తుంటారు. కరోనా పెరుగుతున్న సమయంలో జరుగుతున్న ఈ జాతరల్లో ముందు జాగ్రత్తల పరిస్థితి ఏంటి? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. జనవరి మాసం వచ్చిందంటే చాలు వరంగల్ జిల్లాలో జాతర సీజన్ మొదలవుతుంది. ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా కొత్తకొండ, కొమురవెల్లి, మేడారం జాతరలు జరుగుతాయి. సంక్రాంతి నుంచి మొదలయ్యే జాతరలతో ఉమ్మడి…