సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. మరోసారి ప్రపంచ దేశాలను భయపెట్టింది.. భారత్‌లోకి ఒమిక్రాన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. క్రమంగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతూ పోయాయి.. ఇదే కరోనా థర్డ్ వేవ్‌గా ప్రకటించింది ప్రభుత్వం.. అయితే, సెకండ్ వేవ్ సృష్టించిన కల్లోలం కంటే.. థర్డ్ వేవ్ విజృంభణ మాత్రం తక్కువనే చెప్పాలి.. కేసులు భారీ స్థాయిలో వెలుగు చూసినా.. సెకండ్ వేవ్ సంఖ్య తాకలేకపోయింది.. మరోవైపు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి.. ఇక, తెలంగాణ రాష్ట్రంలోనూ కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది.. ఈ తరుణంలో కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు… రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ముగిసినట్లే అన్నారు. జనవరి మూడో వారం నుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుందని.. జనవరి ఫస్ట్ నుంచి థర్డ్ వేవ్ మొదలవగా, జనవరి 17, 18వ తేదీ నాటికి పీక్ స్టేజ్‌కి వెళ్లింందని.. ఆ తర్వాత నుంచి డిక్రీజింగ్ ట్రెండ్ మొదలైందన్నారు. ఇంకో వారం, పది రోజుల్లో థర్డ్ వేవ్ ముగిసిపోయే అవకాశం ఉందన్న ఆయన.. ఆ తర్వాత ముందటి పరిస్థితులు నెలకొంటాయంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: ఏపీకి ‘ప్రత్యేక హోదా’పై కుంటిసాకులు ఎందుకు..?
ఇక, కరోనా థర్డ్ వేవ్ ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉందని వెల్లడించారు శ్రీనివాసరావు.. కరోనా కేసులు, కోవిడ్ వ్యాప్తి పరంగా చూసినా పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉందని తెలిపారు.. థర్డ్‌వేవ్ మొదలైన 18 రోజుల్లోనే పీక్‌లోకి వెళ్లిందని.. ఇప్పటికే పూర్తిగా తగ్గాల్సి ఉన్నా ఒమిక్రాన్ బీఏ 2 సబ్ వేరియంట్ మొదలుకావడంఓ ఆలస్యమైందన్నారు. ఇక, కోవిడ్ కొత్త వేరియంట్లు, వేవ్‌ల గురించి భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చిన ఆయన.. వేవ్‌లు, వేరియంట్లు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోవద్దని సూచించారు. ఏదైనా ఉంటే ప్రజలను ముందే అలర్ట్ చేస్తామని.. అయితే, కోవిడ్ వైరస్ ముప్పు పోయే వరకు మాత్రం మాస్క్ పెట్టుకుంటే సరిపోతుందన్నారు.. ఇదే సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హోమ్ ఐసోలేషన్ కిట్లు థర్డ్ వేవ్‌లో కీలకంగా పనిచేశాయని తెలిపారు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు..