వైరల్‌గా మారిన అసిస్టెంట్ కలెక్టర్ వెడ్డింగ్ ఇన్విటేషన్.. లవ్ స్టోరీ మొత్తం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ ఐఏఎస్ అధికారి వెడ్డింగ్ ఇన్వటేషన్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది… తొలిచూపు నుంచి పెళ్లి పీటల వరకు జరిగిన తమ లవ్ స్టోరీని కవితగా మలచి.. ఓ సినిమా స్టైల్‌లో యాజిమేషన్ రూపంలో తయారు చేసిన వెడ్డింగ్ ఇన్విటేషన్ ఎంతగానో ఆకట్టుకుంటుంది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా పని పనిచేస్తున్న రాహుల్‌ది మహబూబ్‌నగర్ జిల్లా.. ఈ నెల 10వ తేదీన మనీషా అనే యువతిని పెళ్లిచేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన రూపొందించిన వెడ్డింగ్ కార్డు అదరహో అంటుంది..
Read Also: కరోనా మహమ్మారి.. డబ్ల్యూహెచ్‌వో తాజా వార్నింగ్
Also Read
రాహుల్-మనీషా.. ప్రేమకు పెద్దలు ఓకే చెప్పడంతో పెళ్లి పీఠలు ఎక్కుతున్నారు.. ఇక, తొలిచూపు నుంచి జరిగిన వారి ప్రయాణాన్ని మొత్తం షార్ట్‌కట్‌లో చెప్పుకొచ్చారు రాహుల్.. బస్సులో వారు కలిసి ప్రయాణం చేయడం.. మొదట ఆకర్షణ.. ఆ తర్వాత మాటలు కలవడం.. బస్సు జర్నీ కాస్తా బైక్ ఎక్కడం.. ఎక్కడో తెలియని మొహమాటం.. చివరకు దేవాలయం వద్ద వారి ప్రేమ చిగురించిన విధానం.. ఆ ప్రేమ ముందుకు సాగి.. పెద్దల వరకు చేరడం.. వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఆ తర్వాత జరిగిన ఎంగేజ్‌మెంట్.. ఫెళ్లి ఫిక్స్ చేయడం.. ఇలా అన్నీ వీడియో రూపంలో చూపించారు.. ఈ నెల 10న ఉదయం 11.55 గంటలకు ఐఏఎస్ ఆఫీసర్ రాహుల్-మనీషా వివాహం మహబూబ్ నగర్‌లో జరగనుంది… మొత్తంగా ఖమ్మం ట్రైనీ కలెక్టర్‌గా పని చేస్తున్న రాహుల్ తన వాయిస్‌తో ఒక్క అందమైన కవితను జోడించి.. ఓ సినిమా స్టైల్‌లో యానిమేషన్‌లో తయారు చేసి ఇన్విటేషన్ కార్డు అందరినీ కట్టిపడేస్తోంది.. కాబోయే కలెక్టర్ రాహుల్ చేసిన ఈ ప్రయోగం అందరిని ఆకర్షిస్తోంది…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!