యాదాద్రి కూడా హైదరాబాద్‌తో కలిసి పోయిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించారు.. రూ.53.20 కోట్ల వ్యయంతో కలెక్టరేట్ నిర్మాణం జరిగింది. ఇక, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోందన్నారు.. భూముల విలువ విపరీతంగా పెరిగిందని… యాదాద్రి కూడా హైదరాబాద్‌లో కలిసిపోయిందన్నారు. ఇక, భువనగిరి జిల్లా ఏర్పాటు చేసుకొని, అద్భుతమైన జిల్లా కలెక్టరేట్‌కు ప్రారంభించింకున్నందుకు జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కలెక్టర్‌ను అభినందనలు తెలిపారు సీఎం.. ఎప్పుడు ఎవరూ ఊహించిన మాట కాదు.. భువనగిరి జిల్లా అవుతుందని కలలో ఎవరూ అనుకున్న మాట కాదన్నారు.
Read Also: Vijayasai Reddy: సినీ ప్రముఖులు-సీఎం భేటీ.. బాబు, లోకేష్ భోంచేసి ఉండరు..!
యావత్ భారత్‌దేశంలో అన్ని రాష్ట్రాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాయని.. కానీ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేయలేదన్నారు కేసీఆర్.. గతంలో కొందరు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్న ఆయన.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్వయంగా మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేస్తానని చెప్పారు. కారణం ఏదైనా ఆయన సైతం చేయలేకపోయారని గుర్తుచేసుకున్నారు.. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు సంప్రదించి మొదటి వ్యక్తి ఛత్తీస్‌గఢ్ చీఫ్ అడ్వైజర్ అని తెలిపారు సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమం చేసిన సందర్భంలో నేను ఆయనను డజన్ సార్లు కలవడం జరిగిందన్న ఆయన.. చాలా మందికి అపనమ్మకం, ఆత్మవిశ్వాసం లేకపోవడంతో ఏమో కొట్లాడుతునున్నారు.. కానీ, మాకు సంపూర్ణ నమ్మకం ఉండేది.. తెలంగాణ వందకు వందశాతం వస్తదని. ఇక, భువనగిరి ర్యాపిడ్‌గా వేగంగా డెవలప్ అయ్యే ప్రాంతం అన్నారు కేసీఆర్.. యాదాద్రి టెంపుల్ అభివృద్ధి అయిపోతే.. అనూహ్యంగా అభివృద్ధి చెందుతుందన్న ఆయన.. బీబీ నగర్, భువనగిరి, ఘట్కేసర్, హైదరాబాద్ అంతా కలిసిపోయి కారిడర్‌గా ఉంటుందన్నారు.. తాను కలగనే కారిడార్ వరంగల్ – హైదరాబాద్ అద్భుతమైన కారిడార్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు..
ఇక, రాష్ట్రంలో ఎక్కడవెళ్లినా భూముల ధరలు పెరిగాయని తెలిపారు సీఎం కేసీఆర్.. భువనగిరి, యాదాద్రిలో భూముల ధరలు ఎట్ల ఉన్నాయని ప్రశ్నించిన ఆయన.. ఒకప్పుడు ఎట్ల ఉండే…? ఇప్పుడు గుట్టపొంటి సైతం కోట్లే నని.. మారుమూల గ్రామాలకు పోతే 25-30లక్షల్లోపు ఎకరం భూమి దొరికే పరిస్థితి లేదన్నారు.. మహబూబ్‌నగర్ జిల్లాలో మాగనూర్ మండల కేంద్రంలో భూములు అడిగేవారి ఉండకపోయేది.. కానీ, ఇప్పుడు అక్కడ సైతం రూ.25లక్షల ఎకరంకు తక్కువ లేదన్నారు.. తెలంగాణ శివారులోని కర్ణాటకలో రూ.4 లక్షలు, రూ.5 లక్షలకే ఎకరం పొలం ఉంటే.. మన ప్రాంతంలో మాత్రం రూ.25లక్షలకు తక్కువ లేదని వెల్లడించారు సీఎం కేసీఆర్.