గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లిహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటిన ప్రముఖ సింగర్ శ్రీలలిత. మొక్కలు నాటడం సంతోషంగా ఉంది..ప్రకృతి మనకు తల్లిలాంటిది అని అలాంటి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు శ్రీలలిత. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అప్రతిహతంగా సాగిపోతోంది. సినీతారలు, సెలబ్రిటీలు ఎక్కువగా మొక్కలు నాటుతూ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ లలిత మాట్లాడుతూ ఎంపీ సంతోష్…
కేంద్రం మీద నెపం నెట్టి గిరిజన ఓట్లు లాక్కునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గిరిజనుల గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్కు లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటే ఉన్నది గిరిజనులేనన్నారు. తెలంగాణ వచ్చిన మరునాడే గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తా అన్న కేసీఆర్ ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయడం లేదన్నారు. Read Also: మరిన్ని రైళ్లలో జనరల్ టిక్కెట్లు పెంచే యోచనలో…
కరోనాతో ఆగిపోయిన రైళ్లలో జనరల్ టిక్కెట్లను తిరిగి దశల వారీగా ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నద్ధం అవుతుంది. ఇప్పటికే చాలా రైళ్లలో కరోనా కారణంగా జనరల్ టిక్కెట్లను ప్రభుత్వం నిలిపివేసింది. కరోనా అనంతరం చాలా రైళ్లు తిరిగి ప్రారంభం అయినా కేవలం రిజర్వేషన్ టిక్కెట్ సౌకర్యం మాత్రమే రైల్వే శాఖ కల్పించింది. దీంతో సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు సొంత వాహనాలు, లేదా బస్సులను ఆశ్రయించారు. అయితే తాజాగా కొన్ని…
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వేను కూడా కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. ట్రైన్ ఆపరేటర్లు, ఇతర సిబ్బంది వరుసగా కోవిడ్ బారిన పడుతుండటంతో రైల్వేశాఖ కలవరపడుతోంది. ఈ మేరకు కరోనా కేసులు పెరగుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 21 నుంచి 24 వరకు 55 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దయిన జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు మొదలైన ప్రాంతాలకు వెళ్లే…
ఇటీవల రాష్ట్రంలో బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు.. ఇటు రాష్ట్రం లోనే కాకుండా దేశ వ్యాప్తంగా బండి అరెస్టును వివిధ వర్గాలు ఖండించాయి. అయితే తనను అరెస్టు చేసే సమయంలో తెలంగాణ పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదని బండి సంజయ్ అరోపించారు. అంతే కాకుండా తన అరెస్టు వ్యవహారం పై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి కూడా ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు చేశారు.…
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాంత్ గౌడ్(42)అనామిక (40), కూతురు శ్రీ స్నిగ్ద (7) గా పోలీసులు గుర్తించారు. భార్య,కూతురుకు విషం ఇచ్చి.. తాను ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీకాంత్. 10 ఏళ్ల కిందట ప్రేమ వివాహాం చేసుకున్నారు శ్రీకాంత్, అనామిక. శ్రీకాంత్ TCS కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాడు…అనామిక ఓ కార్పొరేటర్…
తెలంగాణలో మరోసారి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదనంగా రూ.4,500 కోట్ల రాబడికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఆస్తులు, భూముల విలువపై సహేతుక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను 50 శాతం పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. Read Also: శరవేగంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు.. 4 రోజుల్లో 45 అటు స్థలాల విలువను 35 శాతం,…
★ అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం… 32 అంశాలతో కూడిన అజెండాపై కీలకంగా చర్చించనున్న కేబినెట్★ నేడు విశాఖ రానున్న కేంద్ర చమురు శాఖ సహాయమంత్రి రామేశ్వర్… ఐఐపీఈ తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రామేశ్వర్.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు★ నేడు సచివాలయంలో ఉద్యోగ సంఘాల సమావేశం… ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్న ఉద్యోగ సంఘాలు.. పీఆర్సీపై ఐక్యంగా పోరాటం చేయాలని ఉద్యోగ సంఘాల నిర్ణయంనేడు…
రైల్వే లైన్ల మంజూరు విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు వినోద్ కుమార్ లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణ రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్ల మంజూరు విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని వినోద్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం పై ఇప్పటికైనా వివక్షను మానుకోవాలని అన్నారు. వచ్చే రైల్వే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా రైల్వే లైన్‌ను మంజూరు…