KCR: రాహుల్‌పై బీజేపీ సీఎం వ్యాఖ్యలు.. నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ బహిరంగసభలో మాట్లాడిన ఆయన.. కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. ఇదే సమయంలో.. రాహుల్ విషయాన్ని ప్రస్తావించారు.. రాహుల్ గాంధీతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. అయినా.. ఓ విషయం నన్ను బాధించింది.. ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి.. కేంద్రాన్ని ఏదో ప్రశ్న అడిగారు.. దానిపై స్పందించిన బీజేపీ సీఎం.. నువ్వు ఎవరికి పుట్టావంటూ వ్యాఖ్యానించారని మండిపడ్డారు.. ఆ మాటలు వింటే నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయన్న కేసీఆర్.. ఇదా మన సంప్రదాయం అంటూ నరేంద్ర మోడీని, జేపీ నడ్డాను నిలదీశారు.. దీనిపై సమాధానం చెప్పాలని.. వెంటనే అస్సాం సీఎంను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు..
Read Also: Schools Development: యజ్ఞంలా పాఠశాలల అభివృద్ధి..
Also Read
- Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అలా దిగజారి మాట్లాడవచ్చా? అంటూ ఫైర్ అయ్యారు కేసీఆర్.. ఇంత అహంకారమా..? కళ్లు నెత్తికెక్కాయా.. అంటూ ఆయన ఘాటుగా స్పందించారు కేసీఆర్.. కాగా..! పీవోకేలో ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్‌పై ఆధారాలు బయటపెట్టాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించిన విషయం తెలిసిందే కాగా.. రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. నువ్వు రాజీవ్ గాంధీ కొడుకువో కాదో అని మేం ప్రూఫ్ అడిగామా అంటూ ప్రశ్నించారు.. ఆర్మీ నుంచి సర్జికల్ స్ట్రైక్స్ ఆధారాలు డిమాండ్ చేసే హక్కు నీకు ఉన్నదా అని ప్రశ్నించిన ఆయన.. సర్జికల్ స్ట్రైక్స్ గురించి ఆర్మీ చెప్పిందంటే దానిపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయకూడదంటూ సీఎం హిమంత బిస్వా శర్మ పేర్కొన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
-
Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్‌ప్లే
-
Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!