వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో చోటు చేసుకున్న మిర్చి రైతుల ఆందోళనలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షా నిర్వహించారు. హైద్రాబాద్ నుంచి జిల్లా కలెక్టర్ గోపి, మార్కెట్ చైర్మన్ దిడ్డి భాగ్యలక్ష్మీ కుమార స్వామి, మార్కెట్ కార్యదర్శి, వరంగల్ ఛాంబర్ ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. రైతులకు నష్టం జరుగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు అండగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉంటుందన్నారు. రైతులు ఆందోళన చెందొద్దని పిలుపునిచ్చారు. రైతులను ఎవరు మోసం చేసిన…
తెలంగాణకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలంటూ మంత్రి హరీష్‌రావు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు.గతంలో చేసిన అభ్యర్థనలను ఈ లేఖలో గుర్తు చేశారు మంత్రి హరీష్ రావు. A.P. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (2) ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రెండేండ్ల బకాయి రూ.900…
రాష్ట్రంలో కొత్తగా 20 బ్లడ్ స్టోరేజీ సెంటర్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా, జ్వర సర్వే, వాక్సినేషన్ అంశాలపై సోమవారం వైద్యారోగ్య అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కరోనా కట్టడి కోసం మొదలు పెట్టిన ఫీవర్ సర్వే రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతుందన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఒకవైపు కొత్త ఆసుపత్రులు, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు తో పాటు,…
వరంగల్ రైతులు కన్నెర్ర చేశారు. వ్యాపారుల మోసంపై ఆగ్రహం వ్యక్తం చేవారు. దీంతో ఏనుమాముల మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఏనుమాముల మార్కెట్లో ఉదయం మిర్చి భారీగా వచ్చింది. దీంతో వ్యాపారులు తేజ మిర్చికి రూ.17,200గా ధర నిర్ణయించారు. అనంతరం రూ.14 వేలలోపు ధరలు నిర్ణయిస్తూ కొనుగోళ్లకు దిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మిర్చి యార్డు కార్యాలయంలోకి దూసుకెళ్లారు. ఒక కాంటను ధ్వంసం చేశారు. దీంతో అధికారులు ప్రాధేయపడగా..…
నిజాయితీకి, పరిపాలనా దక్షతకు దామోదరం సంజీవయ్య నిదర్శనం అన్నారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ లక్డీ కాపూల్ లో కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. దామోదరం సంజీవయ్య శత జయంతి వేడుకలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ హనుమంతరావు సంజీవయ్యను గుర్తుచేశారు. ఈనాడు ఎంతోమంది డబ్బులు సంపాదించడానికే రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చేవారు డబ్బులు సంపాదించడానికి రావద్దు ..సేవ చెయ్యడానికి రావాలన్నారు. నీతి నిజాయితీకి కలిగిన వ్యక్తి దామోదరం సంజీవయ్య. రెండు ప్రభుత్వాలు శత…
దళితులపై చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం మాదని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధుపై కాంగ్రెస్, బీజేపీ అనవసర విమర్శలు చేస్తున్నాయన్నారు. దళితులపై బీజేపీ ప్రేమ కల్లబొల్లి మాటల్లోనే తప్ప చేతల్లో చేసిందేమి లేదని హరీష్ రావు అన్నారు. దళిత బంధు వంటి పథకాన్ని దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టాలని.. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చేలా పథకాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో దళితులకు ఎక్కువ నిధులు కేటాయించాలని…
తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగానే నమోదవుతోంది. అయితే ఒకరోజు తగ్గితే మరోరోజు కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. శనివారం రాష్ట్రంలో 4,416 కేసులు రాగా.. ఇవాళ కాస్త తక్కువ కేసులు వచ్చాయి. రాష్ట్రంలో కొత్తగా 4,393 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకిన ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,31,212 కాగా, మరణాల సంఖ్య 4,071గా ఉంది. రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 6,95,942గా ఉంది. రాష్ట్రంలో…
సీపీఎం జాతీయ సమావేశాల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను విమర్శించారు. రాజకీయ విధానం పార్టీకీ ముఖ్యమని, కానీ రాజకీయ విధానం ఎప్పుడు ఒకేలా ఉండదన్నారు. పరిస్థితికి అనుగుణంగా మారుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఆచరణ సాధ్యం కానీ మార్గాలను ఎంచుకున్నారని, కాళేశ్వరం ఒక్కటే తెలంగాణ ప్రజల సమస్యలను తీర్చదన్నారు. ఆంధ్రా వాళ్ళ వల్లనే మనకు ఉద్యోగాలు రావడం లేదని కేసీఆర్ చెప్పారన్నారు. దళితులకు మూడెకరాలు…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్న సంగతి తెల్సిందే. దీనిపై తాజాగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 56 వేల పడకలు ఏర్పాటు చేశామని.. కరోనా కేసులతో వస్తున్న రోగులకు సత్వర వైద్యం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇంటింటికీ ఫీవర్ సర్వే చేస్తూ… ఉచిత మెడికల్ కిట్ లను అందిస్తున్నామని ప్రకటన చేశారు. Read Also: ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడుతున్నారు:…