ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పందించాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్… పార్లమెంట్ సాక్షిగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దకుంటే భావితరాలు క్షమించమని హెచ్చరించారు.. ఇక, ఏపీకి జరిగిన అన్యాయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడాలని సూచించిన ఉండవల్లి.. బీజేపీని నిలదీసేందుకు ఏపీని కలుపుకోవాలన్నారు.. ఎనిమిదేళ్ల క్రితం లోక్‌సభలో ఏపీ విభజన బిల్లు ఆమోదం జరిగినట్టు ప్రకటించారని తెలిపారన్న ఆయన.. రాష్ట్ర విభజనలో ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రధాని మోడీ, అమిత్ షాలు పార్లమెంట్ ఉభయసభల్లోనే చెప్పారని గుర్తు చేశారు.. ఇక, సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు కొట్టుకొని ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తారా అని మండిపడిన ఉండవల్లి అరుణ్ కుమార్.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నించరా? అని నిలదీశారు.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సీఎం జగన్ నోరుమెదపకపోవటం అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.
Read Also: Chinna Jeeyar Swamy: కేసీఆర్‌తో విభేదాలేంటి..?