తెలంగాణ ప్రభుత్వంపై కాసుల వర్షం కురిపిస్తోంది రిజిస్ట్రేషన్ల శాఖ.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.10 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని రాబట్టింది… గతంలో ఎప్పుడూ రూ.10వేల కోట్ల మార్క్ చేరుకోలేదు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం.. గత ఆర్థిక సంవత్సరంలో 10 వేల కోట్ల ఆదాయం టార్గెట్ పెట్టుకున్నా.. కేవలం రూ.5,243 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో టార్గెట్ రూ.12,500 కోట్లు పెట్టుకుంటే.. ఇప్పటికే రూ.10 వేల కోట్ల మార్క్‌ను దాటేసింది..
Read Also: Hyderabad: ఓయూలో నకిలీ సర్టిఫికెట్ల కలకలం..! సీపీకి ఫిర్యాదు
వ్యవసాయ, వ్యవసాయే తర భూములు, ఆస్తుల ప్రభుత్వ విలువలను ప్రభుత్వం పెంచినా.. ఆ ప్రభావం రిజిస్ట్రేషన్లపై లేదని చెబుతున్నారు అధికారులు.. విలువలు పెరిగిన తర్వాత 15 రోజుల్లోనే ఆ శాఖ ఆదాయం అమాంతంగా పెరిగిపోయింది.. ఈ నెల 1వ తేదీ నుంచి గురువారం వరకు 61 వేలకుపైగా లావాదేవీలు జరగగా, రూ.502. 87 కోట్ల ఆదాయం సమకూరినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.. కాగా, గతేడాది జూలైలో ప్రభుత్వ విలువలను సవరించడం, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచినప్పటి నుంచే రిజిస్ట్రేషన్ల ఆదాయం కాసులు కురిపిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.. తాజాగా ఈ నెల 1వ తేదీ నుంచి ప్రభుత్వ విలువలను మరోసారి సవరించిన నేపథ్యంలో ఈ ఆదాయం మరింత పెరిగింది.