ఇప్పటికే ఐఏఎస్ అధికారుల విషయంలో రాష్ట్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.. ఐఏఎస్ అధికారుల పోస్టింగ్‌లలో పక్షపాత వైఖరి సరికాదని సూచించారు.. బీహార్ అధికారులే మీకు నచ్చడం.. మెచ్చడం వెనక ఉద్దేశం ఏంటి..? అని లేఖలో ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి… DOPT నిబంధనలకు వ్యతిరేకంగా సోమేష్ కుమార్‌ని ఎలా సీఎస్‌ను చేశారని నిలదీశారు.. HMDA, RERAలో అరవింద్, సోమేష్ కుమార్ ఇచ్చిన అనుమతులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రేవంత్‌రెడ్డి..
Read Also: Mekapati on YS Jagan: జగన్‌పై మేకపాటి సంచలన వ్యాఖ్యలు..
కాగా, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ కేడర్ఐఏఎస్అధికారులపై ఈ మధ్యే సంచలన వ్యాఖ్యలు చేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. వందలాది ఆత్మబలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో.. స్థానిక అధికారులకు కీలక బాధ్యతలు దక్కడం లేదని ఆరోపించారు. బీహార్‌కు చెందిన ఐఏఎస్అధికారులకు కీలక పదవులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. సీఎస్, డీజీపీ పోస్టులనూ వారికే కట్టబెట్టారని విమర్శించారు. సీఎస్సోమేష్కుమార్, ఇంఛార్జీ డీజీపీ అంజనీకుమార్, సీనియర్ఐఏఎస్అధికారులు జయేష్ రంజన్, అర్వింద్‌కుమార్, రజత్‌కుమార్, సందీప్‌కుమార్‌సుల్తానియా, వికాస్‌రాజ్‌కు మూడు నుంచి ఆరు శాఖలను కట్టబెట్టారని ఆరోపించారు. బీహార్ఐఏఎస్లను రక్షణ వలయంగా చేసుకొని పరిపాలన చేస్తున్నారని విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.