హైదరాబాద్ నగరంలో రాజీవ్ స్వగృహ పథకంలో భాగంగా నిర్మించిన ఇళ్లపై హెచ్ఎండీఏ కీలక ప్రకటన చేసింది. రాజీవ్ స్వగృహ ఇళ్ల వేలానికి సంబంధించి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. బండ్లగూడ, నాగోల్‌లోని సహ భావన టౌన్షిప్ 15 టవర్‌లో మొత్తం 2246 ఇళ్లు అమ్మకానికి ఉన్నాయని తెలిపింది. వీటిలో చదరపు గజం కనీస ధర రూ. 2200 నుంచి రూ. 2700గా నిర్ణయించారు. అలాగే ఖమ్మం జిల్లా పోలేపల్లిలోని జలజ టౌన్ షిప్ 8 టవర్‌లో ఏకంగా…
తెలంగాణ రాజకీయ నేతలపై పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ నేతలు రాజకీయ విమర్శలను కళారంగానికి అంటనీయరని పవన్ కొనియాడారు. తెలంగాణ నేతలు అందుకే ప్రత్యేకంగా నిలుస్తారని తెలిపారు. సృజనాత్మకత, సాంకేతికతల మేళవింపుతో కొనసాగే సినిమా రంగాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారని.. కళను అక్కున చేర్చుకుని అభినందించడానికి ప్రాంతీయ కుల, మత భేదాలు ఉండవని తెలియజెప్పినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పవన్ ప్రకటించారు. ఒకవైపు బయో ఏషియా సదస్సులో బిల్‌గేట్స్‌తో కీలకమైన వర్చువల్ భేటీ…
జగ్గారెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. అధిష్టానానికి లేఖరాసి.. ఇక తాను కాంగ్రెస్ గుంపులో లేనని పేర్కొన్న ఆయనను సముదాయించడానికి సీనియర్లు రంగంలోకి దిగారు.. జగ్గారెడ్డి రాజీనామా చేయకుండా సముదాయించామని, ఆయన లేవనెత్తిన అంశాలపై అధిష్టానంతో మాట్లాడుతామని సీఏల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే.. జగ్గారెడ్డికి కొన్ని ఇబ్బందులున్నాయని, తమ దృష్టికి తెచ్చారని తెలిపిన ఆ నేతు.. జగ్గారెడ్డి కార్యకర్తల సమావేశానికి రాజీనామాకు సంబంధం…
★ హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో రూ.7వేల కోట్ల వ్యయంతో నిర్మించిన తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రాన్ని నేడు ప్రారంభించనున్న మంత్రి నిరంజన్‌రెడ్డి★ నేడు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. రాష్ట్రపతి ఎన్నికలే ఎజెండాగా పలువురు ముఖ్య నేతలతో కేసీఆర్ మంతనాలు★ సంగారెడ్డి: ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశం… భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్న జగ్గారెడ్డి★ నేడు ప్రొ.కబడ్డీ 8వ సీజన్ ఫైనల్.. పట్నా పైరేట్స్‌తో తలపడనున్న దబాంగ్ ఢిల్లీ.. రాత్రి 8:30…
భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ని న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఈరోజు కలిశారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేటటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల అనేక మంది నిరుపేదలు, నిరుద్యోగులు, మహిళలు, దారిద్ర రేఖకు దిగువ ఉన్న ఉన్న ప్రజలు లబ్ధిని పొందలేక పోతున్నారని వివరించారు. కరోనా కష్టకాలంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడం…
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లు సీఈసీ వెల్లడించింది. ఈ మేరకు వైఎస్ఆర్టీపీకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖను పంపింది. తమ పార్టీ పేరును రిజిస్టర్ చేసినట్టుగా తమకు లేఖ అందినట్లు పార్టీ అధ్యక్షుడు వాడుక రాజగోపాల్ ప్రకటించారు. తమ పార్టీని రిజిస్టర్ చేయాల్సిందిగా కోరుతూ 28 డిసెంబరు 2020లో ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశామని…
★ నేడు ప్రజాదీక్ష చేపట్టనున్న అమరావతి రైతులు.. వెలగపూడిలో 24 గంటల పాటు రైతుల సామూహిక నిరాహార దీక్ష.. ఉదయం 9 గంటల నుంచి 24 గంటల పాటు దీక్ష.. రాజధాని ఉద్యమం 800వ రోజుకు చేరిన సందర్భంగా దీక్ష★ ఏపీలో జిల్లాల విభజనపై నేడు రెండో రోజు కలెక్టర్లతో ప్రణాళిక శాఖ సమావేశాలు.. జిల్లాల విభజనపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలపై చర్చ★ తూ.గో.: నేడు బీజేపీ ఛలో అమలాపురం కార్యక్రమం.. కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్‌కు రాష్ట్ర…
కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. మల్లన్న సాగర్ ను సీఎం కేసీఆర్ ప్రజలకు కాకుండా కల్వకుంట్ల కుటుంబానికి అంకితం చేశారన్నారు. మసిపూసి మారెడు కాయ చందంగా కేసీఆర్ వ్యవహరించారు. కాళేశ్వరం నుంచి వర్షాకాలంలో మల్లన్న సాగర్ కు చుక్క రాదు. కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ కు నీళ్లు రావడానికి ఎన్ని రోజులు పడతాయి. ఒక టూరిజం స్పాట్ కోసం లక్ష కోట్ల రూపాయల ఖర్చు చేశారు.…
ఖర్చులకు డబ్బులు కావాలా..ఇంట్లో స్నేహితులను అడిగితే డబ్బులు ఇవ్వడం లేదా..లేకపోతే ఎవరినైనా చేబదులు అడగాలంటే సిగ్గుగా అనిపిస్తుందా? బ్యాంకుల చూట్టు తిరిగే ఓపిక లేదా? డోంట్ వర్రీ ఇకపై మీకు ఆ ఇబ్బంది లేదు….ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే సెకన్లలో ఆన్ లైన్ లో మీ ఎకౌంట్ కు డబ్బులిచ్చేస్తాం అంటున్నారు ఆన్ లైన్ పర్సనల్ లోన్ యాప్ నిర్వాహకులు. ఇదేదో ప్రజాసేవ కాదు….మధ్యతరగతి ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని పీక్కుతినే మైక్రోఫైనాన్స్ లాంటి దిక్కుమాలిన ఆన్…
తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు మల్లన్నసాగర్‌ను సీఎం కేసీఆర్ బుధవారం నాడు జాతికి అంకితం చేశారు. సిద్ధిపేట జిల్లాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టును ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ… తెలంగాణకు కరవు రాకుండా చేసే ప్రాజెక్టే కాళేశ్వరం అని పేర్కొన్నారు. దేశమంతా కరవు వచ్చినా ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు మాత్రం రాదని కేసీఆర్ అన్నారు. మల్లన్నసాగర్ ప్రారంభంతో కాళేశ్వరం కల సాకారమైందన్నారు. ఈ ప్రాజెక్టు ఆపేందుకు చాలా మంది ఎన్నో కేసులు వేశారని.. అయినా తాము వెనక్కి…