Case Against Teacher: తోటి మహిళా టీచర్‌పై అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారిద్దరు ఉపాధ్యాయులే. తోటి ఉపాధ్యాయురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమెని బెదిరించి అత్యాచారం చేసిన ఘటన ఇది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు వెలుగు చూసింది. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఖమ్మం జిల్లాకు చెందిన ఉపాధ్యాయుదు నమ్మించి, బెదిరించి మరో ఉపాధ్యాయురాలిని మోసం చేసి అత్యాచారం చేశాడు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీ టీచర్ గా పనిచేస్తున్న బానోతు కిషోర్ అదే మండలంలో మరో పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని నమ్మించి, తనతో పాటు తీసుకెళ్లి ,బెదిరింపులకు పాల్పడి అత్యాచారం చేశాడు.
కీచక ఉపాధ్యాయుడు కిషోర్ తాను మండల పిఆర్టీయు నాయకుడు అని కూడా చెబుతూ భయబ్రాంతులకు పాల్పడ్డాడు. ఉపాధ్యాయ సంఘానికి చెందిన నాయకుడు కావడంతో అతనితో మంచిగా మసలుకుంది బాధిత మహిళ. ఆమె ప్రతిరోజు గార్ల మండలానికి ఖమ్మం నుండి రైలు ద్వారా తన విధులకు వెళ్లి వస్తుండేది. కీచక ఉపాధ్యాయుడు కిషోర్ అతడి భార్య కూడా ఇదే మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ భార్యాభర్తలు ప్రతిరోజు ఖమ్మం నుండి తమ కారు ద్వారా గార్ల మండలానికి వెళ్తూ వస్తుండేవారు. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం కూడా ఉంది. ఒకరోజు భార్యాభర్తలు బాధిత మహిళను తమ కారులో ఆహ్వానించారు.
Also Read
- Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్!
ఇష్టం లేకపోయినా వారి బలవంతం మీద కారులో ఒకటి రెండుసార్లు ఆమె ఖమ్మంకు వచ్చింది. బాధిత మహిళ మీద కన్నేసిన కిషోర్ అవకాశం కోసం ఎదురుచూశాడు. ఈనెల 17వ తేదీన సాయంత్రం ఆమె ఒంటరిగా గార్ల రైల్వే స్టేషన్ లో రైలు కోసం నిలబడి ఉంది. ఇదే అదునుగా భావించి, తాను తన భార్య కారులో పోతున్నామని ఖమ్మంలో దింపుతామని, చెప్పటంతో బాధిత మహిళా టీచర్ కిషోర్ కారు ఎక్కింది.
ఆ వెంటనే అతడి భార్య గురించి అడగ్గా వచ్చే స్టేజీలో ఎక్కుతుందని నమ్మించాడు. ఆ విధంగా పై స్టేజ్లో ఆపై స్టేజ్లో తన భార్య కారు ఎక్కు తుందని నమ్మించాడు. ఖమ్మం నగరంలోని పాండురంగాపురం ప్రాంతంలో గల ఒక ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవ్వరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో మహిళ ధైర్యం చేసి రెండు రోజుల తరువాత భర్తకు సమాచారం ఇచ్చింది. ఖమ్మం అర్బన్ పోలీసు స్టేషన్లో భార్యాభర్తలు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
-
Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్‌ను ఒప్పించడం కష్టమైంది!
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!