దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి గాంచిన భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను ఆలయ అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 2 నుంచి 16 వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. ఏప్రిల్ 10న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 2న ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ…
హైదరాబాద్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి… పహాడీషరీఫ్‌లో లారీ డ్రైవర్‌పై కాల్పులు జరిపిన దుండగులు.. దారి దోపిడీకి పాల్పడ్డారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. టైర్ల లోడ్‌తో వెళ్తున్న లారీని ఆపిన దుండగులు.. లారీ డ్రైవర్‌పై కాల్పులు జరిపారు.. డ్రైవర్‌ను భయపెట్టి 44 లక్షల రూపాయల విలువైన టైర్లను అపహరించారు.. డ్రైవర్ పై కాల్పులు జరిపి లారీని అపహరించరు దుండగులు.. ఆ తర్వాత టైర్లు అన్నింటినీ గోదాంలో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డ్రైవర్ని వదిలిపెట్టింది…
తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో దాదాపు 10వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త జోనల్ విధానంపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వీటిని భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పోస్టుల్లో 1,250 పైగా జూనియర్ లెక్చరర్ పోస్టులు ఉండగా.. భాషా పండితులు, పీఈటీలు కలిపి మరో 1,200 ఉన్నాయి. వీటి భర్తీ కోసం ఇప్పటికే ప్రభుత్వానికి సొసైటీలు ప్రతిపాదనలు పంపాయి.…
ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. గతంలో జారీ చేసిన జీవో 58, 59 నిబంధనలనే కొనసాగించింది. ఆక్రమిత భూములకు సంబంధించి జీవో 59 కింద రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకుంటే 125 గజాల వరకు ఉచితంగా ప్రభుత్వం క్రమబద్ధీకరించనుంది. గతంలో ఉన్న ఆస్తి విలువలో 12.5% చెల్లించే నిబంధనను ప్రభుత్వం తొలగించింది. మార్చి 31వ తేదీ వరకు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఒకవేళ దరఖాస్తును…
తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలం వచ్చేసింది. క్రమంగా ఎండల తీవ్రత పెరుగుతోంది. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 3.3 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతోంది. సోమవారం తిరుపతిలో 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పలుచోట్ల ఉదయం 9 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. అనంతపురం, కర్నూలు వంటి పట్టణాల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 36.6 డిగ్రీలకు చేరాయి. కడపలో 36.2, తూర్పుగోదావరి జిల్లా తునిలో 36.1, ప్రకాశం జిల్లా ఒంగోలులో 35.7, అమరావతిలో 35.2…
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో ప్రశ్నల ఛాయిస్‌ను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ప్రశ్నల సంఖ్యను కూడా గణనీయంగా పెంచింది. గతంలో కొన్ని సెక్షన్లలో మాత్రమే ఛాయిస్ ప్రశ్నలు ఇవ్వగా, ఈ ఏడాది అన్ని సెక్షన్లలో ప్రశ్నల సంఖ్యను పెంచి, ఛాయిస్‌గా వదిలేసుకొనే అవకాశం కల్పించింది. 2021-22 సంవత్సరానికి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియాల మాదిరి ప్రశ్నపత్రాలను ఇంటర్ బోర్డు అధికారులు వెబ్సైట్లో పెట్టారు. గత ఏడాది మూడు సెక్షన్లకు…
✪ నేటి నుంచి మార్చి 4 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఉ.8 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్న అర్చకులు.. స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్న శ్రీకాళహస్తి దేవస్థానం.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి నుంచి భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం.. మార్చి 5 నుంచి స్పర్శ దర్శనాలు పున:ప్రారంభం✪ ఈరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నేవీ హెలికాప్టర్ ద్వారా నెల్లూరుకు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తరలింపు..…
బ్యాంక్ ఖాతాల నిర్వహణపై ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ ఆర్థిక శాఖ… ఇకపై కొత్త ఖాతా ఓపెన్ చేయాలి అంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది… ప్రతి నెల బ్యాంకు ఖాతాలను వెరిఫై చేయాలి.. డీటెయిల్స్‌ని 10వ తేదీలోపు ఫైనాన్స్ శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.. ఇక, అవసరం లేని బ్యాంక్ అకౌంట్స్ ని వెంటనే క్లోజ్ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది ఆర్థికశాఖ.. మార్చి…