సిద్దిపేట జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. రిజర్వాయర్‌ను ప్రారంభించడానికి ముందు కేసీఆర్ మల్లన్నకు పూజలు నిర్వహించారు. అనంతరం రిజర్వాయర్‌ను ప్రారంభించి నీటిని విడుదల చేశారు. అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు మాట్లాడారు. మల్లన్న సాగర్ తెలంగాణకే తలమానికం అని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రాజెక్టు ఆగలేదని, ప్రాజెక్టుపై వందలాది కేసులను సుప్రీంకోర్టు కోట్టేసిన…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లన్న సాగర్‌కు చేరుకున్నారు. ఈరోజు మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను రాష్ట్రప్రజలకు అంకితం చేయనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా మల్లన్నసాగర్‌కు చేరుకున్నారు. మల్లన్న సాగర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్ అతిపెద్ద రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ లో 50 టీఎంసీల నీటిని నిల్వచేసే సామర్థ్యం ఉంటుంది. ఈ రిజర్వాయర్ ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట…
జగిత్యాలలో దారుణం చోటుచేసుకుంది. ఒక మహిళ తనకంటూ ఎవరు లేని జీవితం ఎందుకు అనుకుంది.. ఎవరికి భారం కాకూడదనుకుంది. కళ్లముందే కొడుకు, కోడలు మరణాన్ని చూసింది.. మనవడికి భారం కాకుండా తన దారిన తను వెళ్లిపోవాలనుకొని కఠినమైన నిర్ణయం తీసుకొంది. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆమె.. ఆ మంచాన్నే తన చితిగా మార్చుకొంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో మంచానికి నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.…
హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ది చెందుతున్నది. ప్రజల ఆలోచనలు, కల్చర్ సైతం మారిపోతున్నది. ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆలోచిస్తున్నారు. పైగా కరోనా తరువాత చాలా మార్పులు వచ్చాయి. కరోనాకు ముందు ప్రజలు సినిమా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవారు. కానీ, ఆ తరువాత మార్పులు వచ్చాయి. సినిమా థియేటర్లను పక్కన పెట్టి ఒటిటి ద్వారా సినిమాలు చూస్తున్నారు. అయితే, ప్రజల సౌకర్యార్థం నగరంలో డ్రైవ్ ఇన్ థియేటర్స్‌ను ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. కార్లలోనే కూర్చొని…
సిద్దిపేట జిల్లాలోని తుక్కాపూర్ మండలం పరిధిలోనున్న మల్లన్నసాగర్ జలాశయంను సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్దదైన మల్లన్నసాగర్‌ను రాష్ట్రప్రజలకు కేసీఆర్ అంకితం చేయనున్నారు. మల్లన్నసాగర్ పూర్తిసామర్థ్యం 50 టీఎంసీలు కాగా, ఇందులో 30 టీఎంసీల నీటిని జంటనగరాల తాగునీటికోసం తరలిస్తారు. పారిశ్రామిక అవసరాలకోసం 16 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు. ఈ మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద కొత్తపాత ఆయకట్టు కలిపి మొత్తం 15,71,050 ఎకరాలు రానున్నాయి. 10 టీఎంసీలకు ఒక అంచె చొప్పున మొత్తం ఐదు…
వివిధ పాలనా, సాంకేతిక పరమయిన కారణాల వల్ల ఆగిపోయిన ట్రూజెట్ విమాన సర్వీసులు పునరుద్ధరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఈనెల 5 వ తేదీ నుంచి ట్రూజెట్ సర్వీసులు తాత్కాలికంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సర్వీసులు తిరిగి ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషంగా వుందని కంపెనీ వెల్లడించింది. ఈనెల 23వ తేదీ బుధవారం నుంచి వివిధ సెక్టార్లలో సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయని తెలిపింది. హైదరాబాద్-విద్యానగర్-హైదరాబాద్ విద్యానగర్-బెంగళూరు-విద్యానగర్ బెంగళూరు-బీదర్-బెంగళూరు హైదరాబాద్-రాజమండ్రి-హైదరాబాద్ హైదరాబాద్-నాందేడ్-హైదరాబాద్ ముంబై-నాందేడ్-ముంబై ముంబై-కొల్హాపూర్-ముంబై ముంబై-జలగావ్-ముంబైఈ రూట్లలో ట్రూజెట్…
కేసీఆర్ ఇంత కాలం బూతులే మాట్లాడుతారు అనుకున్నా.. ఇప్పుడు జోకులు కూడా బాగానే చెబుతున్నారు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. హైదరాబాద్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. రైతు బతికినంత వరకు రైతే అన్నారు.. రైతు అంటే నిర్వచనం ఏంటి? అని ప్రశ్నించిన ఆమె.. 66 లక్షల మంది రైతులు ఉంటే 41 లక్షల మంది రైతులకే రైతుభీమా ప్రీమియం ప్రభుత్వం కడుతుందని.. మిగతా 25…
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష శిబిరంలో ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడటం, ఆయన ముంబై పర్యటన, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో గంటసేపు లంచ్ మీటింగ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో మాటా మంతీ జరిపారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ కేసీఆర్ జాతీయ ఆకాంక్షలు ఎంతవరకు ఫలిస్తాయి? ప్రాంతీయ పార్టీలు ఏకం కావటం సాధ్యమా? జాతీయ రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషించాలన్న తన…
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులకు ఊరట కల్పించిది నాంపల్లిలోని స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుపడిన వాహనాదారులకు రూ. 2,100 ఫైన్ కట్టించుకుని వదిలేస్తోంది కోర్టు. 2018 ఏడాది నుండి 28,938 పెండింగ్ చలాన్లు ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు.. ఇక, ఫిబ్రవరి 19వ తేదీ నుండి మార్చి 12వ తేదీ వరకు ఫైన్ కట్టుకునే అవకాశం కలిపించింది నాంపల్లి కోర్టు.. దీంతో, నాంపల్లి లోక్‌అదాలత్ వద్ద క్యూ కడుతున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్…