Prahlad Singh Patel: కేసీఆర్ అసమర్థ పాలనపై ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ అసమర్థపాలనపై మండిపడ్డారు కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్. ప్రజా సంగ్రామ యాత్రలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు బండి సంజయ్ పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి డీపీఆర్ ఎందుకివ్వడం లేదన్నారు. డీపీఆర్ లేకుండా నీటి కేటాయింపులు లేకుండా ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.
ఆర్డీఎస్‌పై కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైంది ? కృష్ణా గోదావరి నదుల అనుసంధానం ఏమైంది..? తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ప్రధాన విషయాలను సీఎం కేసీఆర్ మరిచిపోయారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ విమర్శించారు. ఆయన ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. బండి సంజయ్ కుమార్ పాదయాత్ర జోగులాంబ గద్వాల జిల్లాలో కొనసాగుతోంది. ఈ యాత్రలో పాల్గొన్న ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ సందర్భంగా టీఆర్ఎస్ వైఫల్యాలు, అసమర్థతను ఎండగట్టారు.
Also Read
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ప్రహ్లాద్ సింగ్ పటేల్ కేసీఆర్ అసమర్థ పాలనపై మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్ష కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏండ్లు గడిచినా నీళ్లు, నిధుల, నియామకాల సమస్యకు పరిష్కారం కాలేదన్నారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోందనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. RDSలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రహ్లాద్ పటేల్ అన్నారు.
2014 నుంచి అధికారంలో ఉన్న కేసీఆర్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ను ఎందుకు పూర్తిచేయలేకపోయాడన్నారు. కుర్చీ వేస్కొని కూర్చొని ఆర్డీఎస్ పూర్తి చేస్తానని చెప్పి మాట తప్పారన్నారు. కేసీఆర్ కు కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ మిగతా ప్రాజక్ట్ లపై చూపడం లేదని చురకలు అంటించారు. రాష్ట్రంలో హత్యలు, దాడులకు పాల్పడడం సమంజసం కాదన్న మంత్రి ప్రహ్లాద సింగ్ తెలంగాణలో అత్యంత అవినీతి పాలన కొనసాగుతుందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!