ఆరు యూనివర్సిటీ లలో ఉద్యోగార్థులకు ఫ్రీ కోచింగ్ ఇస్తామన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. వర్చువల్ మోడ్ లో ఈ విధానాన్ని ప్రారంభించారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి. యూనివర్సిటీ లలో ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 6 యూనివర్సిటీ లకు ఆర్థిక సహకారం అందించాం. క్వాలిటీ తో కూడిన కోచింగ్ ఇస్తాం. ఉద్యోగుల కేటాయింపు లో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్.
పెద్ద ఎత్తున ఉద్యోగ భర్తీ చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. కోచింగ్ సెంటర్ లకు వెళ్లకుండా యూనివర్శిటీలలోనే ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని అనుకోవడం మంచి నిర్ణయం. అన్ని ఉద్యోగ నోటిఫికేషన్ లు ఒకే సారి కాకుండా … ఒక దాని తర్వాత ఒకటి వేయాలని అనుకుంటున్నాం. దీనివల్ల ఎక్కువ మందికి అవకాశం వస్తుందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. విద్యార్థులు కూడా బాగా ప్రిపేర్ కావాలి… అందరికి అల్ ద బెస్ట్ అన్నారు సబితా ఇంద్రారెడ్డి.
విద్యార్దులక స్టడీ మెటీరియల్ కొరత లేకుండా చూస్తాం. వ్యవసాయ విశ్వ విద్యాలయం పోస్ట్ లు కూడా కొత్తగా ఏర్పడే బోర్డ్ ద్వారానే భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతుందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
Read Also: TS Inter Exams 2022: తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్