ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఆగడం లేదు. టీఆర్ఎస్-బీజేపీ నేతల పరస్పర విమర్శలతో రాష్ట్రంలో వరి రాజకీయం వేడెక్కుతోంది. తెలంగాణ పాలిటిక్స్ మొత్తం వడ్ల చూట్టూనే తిరుగుతున్నాయి. ధాన్యం కొనాలంటూ పలుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంతో.. పోరాట కార్యాచరణను ఉధృతం చేయాలని నిర్ణయించింది టీఆర్ఎస్. ఈనెల 4 నుంచి 11 వరకు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. Read Also: Minister KTR : కిషన్…
హైదరాబాద్లో మెట్రో రైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ కష్టాలు తగ్గిపోయాయి… మెట్రో రైలు ఎక్కితే చాలు.. ట్రాఫిక్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా గమ్యస్థానానికి చేరుకోవచ్చు… కోవిడ్ కంటే ముందు భారీ స్థాయిలో ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణించిన.. కోవిడ్ మెట్రో ప్రయాణాన్ని దెబ్బకొట్టింది.. అయితే, మళ్లీ క్రమంగా మెట్రో ప్రయాణికులు పెరుగుతున్నారు.. అయితే, ఇప్పుడు మరో గుడ్న్యూస్ చెప్పింది హైదరాబాద్ మెట్రో.. ప్రస్తుతం గంటకు 70 కిలో మీటర్ల వేగంతో మెట్రో రైళ్లు నడుస్తుండగా..…
తెలంగాణలో ఈసారి ఎలాగైనా జెండా ఎగురవేయాలని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయం చేశాయి ఆ పార్టీ శ్రేణులు.. కొన్ని ప్రాంతాల్లో ఊహించినదానికంటే ఎక్కువగా సభ్యత్వ నమోదు కావడం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్టుగా చెబుతున్నారు. అయితే, అంతర్గత కుమ్ములాటలు మాత్రం ఆ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి.. పీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత.. కొంత మంది సీనియర్లు అలకబూనారు.. కొందరు తిరిగి లైన్లోకి వచ్చినట్టే…
పంచాంగంలో ఏముందో కానీ సంతోష్ కుమార్ శాస్త్రి నోటి నుండి శుభం మాటలు వచ్చాయి.. వ్యక్తిగతంగా నాకు సంతృప్తిగా ఉంది.. సర్వ జనులకు సుఖం, శాంతి, ఐశ్వర్యం కలగాలని ఆకాక్షించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు.. ప్రగతిభవన్లో ఉగాది వేడుకలు సందడిగా జరిగాయి.. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్, స్పీకర్, మండలి ఛైర్మన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు తదితరలు పాల్గొన్నారు.. సీఎం కేసీఆర్కు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించారు. ఈ…
తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన భారతీయ జనతా పార్టీ.. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనంటూ ధీమా వ్యక్తం చేస్తోంది.. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఇతర పార్టీ నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు.. సీనియర్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటున్నవారు.. ఇలా అందరినీ కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో.. అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలడం ఖాయమైనట్టు తెలుస్తోంది.. టీఆర్ఎస్ పార్టీ నేత, ఆలేరు నియోజకవర్గానికి చెందిన…
తెలంగాణలో హాట్ హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. గాంధీ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో రేవంత్ కేసీఆర్ పై తీవ్రంగా స్పందించారు. పంచాంగ పఠనం, ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రైతుల జీవితంపై మరణ శాసనం రాశాడు కేసీఆర్ అన్నారు రేవంత్. కోడికి ధర తక్కువ.. మసాలాకే ధర ఎక్కువ అయ్యిందంటూ పెట్రోల్, డీజిల్ ధరల్ని ప్రస్తావించారు. లీటర్ పెట్రోల్ నిజానికి 50 రూపాయలకే వస్తుంది. కానీ, కేసీఆర్ 35 రూపాయలు, మోడీ 30 రూపాయలు…
కాలుష్యం పెరిగి కొద్దీ అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం కాలుష్య సుడిగుండంలా మారుతోంది. పారిశ్రామిక అభివృద్ధి ఈ ప్రాంతానికి శాపంలా మారింది. రామగుండంలో భూగర్భం ఉపరితలం అంతా విషతుల్యంగా తయారైంది. ఏ విష వాయువు ఎప్పుడు వ్యాపిస్తుందో తెలియక తాగే నీరు కలుషితంతో అనారోగ్యాల బారిన పడుతూ జనం ఆందోళన చెందుతున్నారు. రామగుండం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఆర్ ఎఫ్ సి ఎల్, జెన్…
కరోనా కారణంగా గత రెండేళ్లుగా శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. పైగా ఇప్పుడు చైత్ర, వైశాఖ మాసాల్లో ముహూర్తాలు కూడా బాగున్నాయి. శ్రీరామనవమి తర్వాత నుంచి వచ్చే నెల 25 వరకు బలమైన ముహూర్తాలు ఉండటంతో అందరూ తమ ఇంట వివాహాలను ఘనంగా జరిపించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్, మేలలో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 90 వేల వివాహ వేడుకలు జరగనున్నాయని తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే సుమారు…