తెలంగాణలోని ఉపాధ్యాయులు ప్రమోషన్ల కోసం ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నారు.. అయితే, వాళ్లకు గుడ్‌న్యూస్ చెప్పే విధంగా… ప్రమోషన్ల ఇప్పటి వరకు ఉన్న మరో అడ్డంకి కూడా తొలగిపోయింది.. పండిట్, పీఈటీ పోస్టుల అప్గ్రేడేషన్ పై కోర్టుకు వెళ్లారు ఎస్జీటీలు.. అయితే, ఇప్పుడు కేసును ఉప సంహరించుకునేందుకు సిద్ధమయ్యారు.. ఒకటి, రెండు రోజుల్లో కోర్టులో ఉప సంహరణ పటిషన్ దాఖలు చేయబోతున్నారు.. పండిట్ పోస్టులకు అర్హులైన ఎస్జీటీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
Read Also: Dharmana Prasada Rao: వరిసాగుకు ప్రత్యామ్నాయం కోసం చర్యలు
మరోవైపు, రాష్ట్రంలో భారీస్థాయిలో ఉద్యోగల భర్తీకి సిద్ధమైన ప్రభుత్వం.. అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు.. వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది సర్కార్… ఇవాళ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే కాగా.. త్వరలో ఉపాధ్యాయులు భర్తీకి కూడా నోటిఫికేషన్ వస్తుందని చెబుతున్నారు. ఇక, ఇప్పటికే టెట్ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే.