తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… రేపు అల్వాల్ లో పర్యటించనున్నారు. రైతు బజార్ ఎదురుగా టిమ్స్ హాస్పిటల్ నిర్మాణనానికి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తిరుమల గిరి ఎక్స్ రోడ్ నుంచి బొల్లారం చెక్ పోస్ట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 3 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ కొనసాగుతుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇక కరీంనగర్ హైవే చేరుకోవడానికి టివోలి ఎక్స్ రోడ్, బోయిన్ పల్లి, సుచిత్ర, మేడ్చల్, ఓఆర్ఆర్ మీదుగా ట్రాఫిక్ డైవర్ట్ చేశారు.
Read Also: Prashant Kishor: పీకే చుట్టూ.. తెలంగాణ పాలిటిక్స్..!
కాగా, ఇప్పటికే గచ్చిబౌలిలో టిమ్స్ హాస్పిటల్ ప్రారంభం కాగా.. హైదరాబాద్‌లో మరో మూడు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) హాస్పిటళ్లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కొత్తగా అల్వాల్, సనత్‌నగర్, కొత్తపేట్ వద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల కోసం రూ. 2,679 కోట్లకు పరిపాలన అనుమతులు ఇస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్.. ఇక, రేపే అల్వాల్ టిమ్స్‌కు శంకుస్థాపన జరగబోతోంది.