Green india Challenge: ట్రీస్ ట్రాన్స్ లొకేషన్ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ . నల్లగొండ పట్టణంలో రోడ్ల విస్తరణలో పోతున్న యాభై ఏళ్ళకు పైబడ్డ వృక్షాలకు తిరిగి పునరుజ్జీవం పోస్తున్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు. నల్లగొండ మున్సిపల్ కమీషనర్ రమణాచారి విజ్ఠప్తిని మన్నించి రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆద్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ట్రీస్ ట్రాన్స్ లొకేషన్ కార్యక్రమానికి పూనుకున్నారు.
మంగళవారం ఉదయం నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ ఛైర్మెన్ సైదిరెడ్డి,,వైస్ ఛైర్మెన్ అబ్బగోని రమేష్, మున్సిపల్ కమీషనర్ కె.వీ రమణాచారి, గ్రీన్ ఇండియా సభ్యులు, వాటా ఫౌండేషన్ సభ్యులు ఈ బృహత్ కార్యాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పట్టణంలోని ఎస్పీ బంగ్లా ముందు యాభై ఏళ్ళ వయస్సు గల వేప ,చింత, రాగి,మర్రి చెట్లను వేర్లతో సహా పెకిలించారు. పెద్ద క్రేన్ ల సాయంతో, పెద్ద ట్రక్కులలో చెట్లను తరలించారు. నల్లగొండ బైపాస్ లోని చర్లపల్లి అర్భన్ పార్క్ లో ఈ చెట్లను తిరిగి నాటారు. మొత్తం 12 చెట్లను ట్రాన్స్ లొకేషన్ చేశారు.. అందులో 11 వేప చెట్లు కాగా, మరొకటి చింత చెట్టు అని నిర్వాహకులు తెలిపారు.
Also Read
రోడ్ల వెడల్పు వల్ల నల్లగొండ పట్టణంలో మొత్తం 200 పైగా చెట్లు తొలగిస్తున్నామని వాటిని అన్నింటిని దశల వారీగా ఆగస్టు మాసం లోపు ట్రాన్స్ లోకేషన్ చేస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. మొదటి ఫేజ్ లో 50 మొక్కల్ని ట్రాన్స్ లొకేషన్ చేసే ప్రక్రియను ఇవ్వాళ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ , వాటా ఫౌండేషన్ ప్రయత్నాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ, సైంటిఫిక్ పద్దతితో యాభై ఏళ్ళ వయస్సున్న చెట్లకు తిరిగి ప్రాణం పోయడం నిజంగా అద్భుతమని భూపాల్ రెడ్డి అన్నారు. ఇప్పటికే జాతీయ ,అంతర్జాతీయ స్దాయి అవార్డ్ లను సొంతం చేసుకున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఈ ట్రాన్సో లోకేషన్ కార్యక్రమంతో మరో గొప్ప మైలురాయిని చేరుకుందని అన్నారు.
తాజావార్తలు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?