తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు బనకచర్ల పొలిటికల్ హాట్ టాపిక్. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఒకే తాను ముక్కలుగా అభివర్ణిస్తూ.. ఇద్దర్నీ ఏక కాలంలో టార్గెట్ చేస్తోంది తెలంగాణ ప్రతిపక్షం బీఆర్ఎస్.
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ.. తమ పొలిటికల్ గాడ్ ఫాదర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. కార్పొరేషన్ ఛైర్మన్, డీసీసీ అధ్యక్ష పదవుల రేసులో నిలిచినా.. వీళ్ళకు ఆ ఒక్కటి అడ్డొస్తోందట. ఎక్కడికెళ్లినా ఆ తప్పునే గుర్తు చేస్తూ.. ఇద్దరికీ పదవులు రాకుండా అడ్డుపడుతున్నారట సీనియర్ కాంగ్రెస్ నాయకులు.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న లెటర్లు రాసుడు కాదుని, ఏపీ సీఎం చంద్రబాబు కోవర్టులు తెలంగాణలో ఉన్నారన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు చూసేది వాల్లే అని విమర్శించారు. ఆ కోవర్టులకు కరెంట్ కనెక్షన్, నల్లా కనెక్షన్లు కట్ చేయండని విజ్ఞప్తి చేశారు. మంచిగ మాట్లాడితే ఆంధ్ర వాళ్లు మాట వినరు అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. Also Read:…
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ‘మేడారం’ మహాజాతర తేదీలు ఖరారు అయ్యాయి. జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుందని పూజారుల సంఘం ప్రకటించింది. సమ్మక్క-సారలమ్మ పూజారుల సంఘం 2026 మేడారం మహాజాతర తేదీలను ఖరారు చేసి.. దేవాదాయ శాఖకు పంపించింది. త్వరలోనే దేవాదాయ శాఖ ఆమోదం తెలపనుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క-సారలమ్మలు వెలిసి ఉన్న విషయం తెలిసిందే. Also Read: ENG vs IND: నేటి నుంచే…
నేడు, రేపు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. మధ్యాహ్నం 12:30 గంటలకు శాంతిపురం మండలంలోని తుమిసి ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకోనున్న సీఎం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ పార్టీ సమావేశం.. అందుబాటులో ఉన్న నేతలతో వైఎస్ జగన్ సమావేశం నేడు జైలు నుంచి విడుదల కానున్న వల్లభనేని వంశీ.. 138 రోజులుగా జైల్లో ఉన్న వంశీ.. 11 కేసుల్లో వంశీకి బెయిల్.. చివరి కేసులో నిన్న బెయిల్ ఇచ్చిన నూజివీడు కోర్టు లిక్కర్ స్కాం…
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.. 222 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.. దీంతో, గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు పైలెట్.. విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు..
Collector Fish Cutting: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఫిష్ వ్యాపారులు, మత్స్యకారులతో కలిసి చేపలను బోన్‌లెస్‌గా (ముళ్లు లేకుండా) తయారు చేసే విధానంపై ప్రత్యక్ష ప్రాక్టికల్ డెమో ఇచ్చారు.
మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వ విప్‌గా పనిచేసిన అడ్లూరి లక్ష్మణ్ కేబినెట్ మంత్రి అయ్యారు. రాంచంద్రు నాయక్‌ని డిప్యూటీ స్పీకర్‌ని చేస్తామని ప్రకటించేశారు పార్టీ పెద్దలు. ఈ క్రమంలో... ప్రభుత్వ విప్ల నియామకంపై ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. విప్ పదవుల భర్తీకి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పూర్తి స్థాయిలో కసరత్తు మొదలుపెట్టిన క్రమంలో.. పార్టీ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది.