Patancheru Blast: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని ప్రభుత్వ ఆస్పత్రిలో మార్చురీలో హృదయవిదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఈ రోజు ( జూలై 1న) పటాన్చెరువు సర్కారు దవాఖానలోని మార్చురీలో ఉన్న మృతదేహాలు చూసి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Pashamylaram Blast: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సమీపంలోని పాశమైలారంలో జరిగిన పేలుడులో సుమారు 40 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ స్పందించారు. ఈ సందర్భంగా పటాన్ చెరువు కెమికల్ ఫ్యాక్టరీలో మృతులకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేశారు.
ప్రేమించుకున్నారు.. కలిసి నడుద్దాం అనుకున్నారు.. ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. ఇద్దరూ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.. నీకు నేను.. నాకు నువ్వు అనుకున్నారు.. ఈ ఇద్దరి ప్రేమకు ఆ రెండు కుటుంబాలు కూడా ఒప్పుకున్నాయి.. ఇద్దరూ ఒకే దగ్గర ఉద్యోగంలో చేరారు.. అయితే, వారి ప్రేమను మృత్యువు కూడా విడదీయలేదు.. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన పేలుడు ఘటన చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపగా.. మృతదేహాలకు పఠాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం చేశారు వైద్యులు
Ramchander Rao: ఎంతో మంది కార్యకర్తల త్యాగాల ఫలితంతోనే బీజేపీ ఈ స్థాయికి చేరుకుంది అని బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. నాకు రాష్ర్ట అధ్యక్ష పదవి ఇవ్వడం గర్వంగా భావిస్తున్నాను.. ప్రతి కార్యకర్త గర్వించాలి.. అందరం కలిసి కట్టుగా పని చేద్దాం అని పిలుపునిచ్చారు.
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి యమా డిమాండ్ ఏర్పడింది. త్వరలోనే... స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న క్రమంలో... డీసీసీ అధ్యక్షులకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోందట ఏఐసీసీ. అదే జరిగితే... రేపటి రోజున టిక్కెట్ల కేటాయింపుల కీలక పాత్ర ఉంటుందిగనుక... ఆ పోస్ట్‌కు యమా క్రేజ్ ఏర్పడిందట.
ఓరుగల్లు కాంగ్రెస్‌లో అంతర్గత పోరు... ఇప్పుడు వీధికెక్కింది. అది ఏ రేంజ్లో అంటే....చివరికి రాష్ట్ర నాయకత్వాన్ని కూడా సవాల్ చేసేంతలా. దీని గురించే ఇప్పుడు కాంగ్రెస్ సర్కిల్స్‌లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చిన కొత్తలో... క్రమశిక్షణ ముఖ్యం, ఉల్లంఘన ఎక్కడ జరిగినా ఉపేక్షించేది లేదంటూ... చాలా గొప్పగా చెప్పేశారు.
Banakacherla Project: ఈ మధ్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య బనకచర్ల ప్రాజెక్టు తీవ్ర వివాదంగా మారింది.. ఎలాగైనా బనకచర్లను అడ్డుకుంటామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించగా.. మిగులు జలాలనేకదా? మేం వాడుకునేది.. అభ్యంతరాలు ఎందుకంటూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశ్నించింది.. అయితే, దీనిపై కేంద్ర మంత్రులను కలిసి ఫిర్యాదులు కూడా చేశారు తెలంగాణ సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిక కేంద్ర సర్కార్ షాక్ ఇచ్చింది.. బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను వెనక్కి పంపింది కేంద్రం.. పర్యావరణ…
కాంగ్రెస్ రాష్ట్రాల్లో కమిషన్ ప్రభుత్వాలు నడుస్తున్నాయని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారిగా కేంద్రమంత్రి నియమింపబడ్డారు.