KCR Health Bulletin: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ (జూలై 2న) తీవ్ర అనారోగ్యం పాలైయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కాగా, ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఆసుపత్రి వైద్యుల బృందం హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది.
బీజేపీకి రాజీనామా చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ.. రాష్ట్ర కార్యాలయంలో.. నేతల ముఖం మీదే చెప్పేసి వెళ్ళిపోయారాయన. అటు నాయకత్వం కూడా.. ఆయన క్రమశిక్షణారాహిత్యం పరాకాష్టకు చేరిందని ప్రకటించింది.
ఫైళ్ళ క్లియరెన్స్ విషయంలో మంత్రికి, ముఖ్య కార్యదర్శికి మధ్య విభేదాలు ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలో హాట్ టాపిక్ అయ్యాయి. మంత్రి తీసుకున్న నిర్ణయాలు రూల్స్‌కు అనుగుణంగా ఉంటే...సంబంధిత శాఖ కార్యదర్శి వాటిని అమలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ విరుద్ధంగా ఉంటే మాత్రం సరైన సలహాలు ఇచ్చి సవరించుకునే విధానాన్ని వివరించాలి. ఇక్కడే మంత్రి కొండా సురేఖకు, తన శాఖ పరిధిలోని ఓ ముఖ్య కార్యదర్శి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరుకున్నట్లు సమాచారం.
వనపర్తి డీసీసీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ పెరిగింది. ఏకంగా అరడజన్ మంది ఆశావహులు జిల్లా కాంగ్రెస్ పీఠంపై కన్నేసి గాంధీభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. రాష్ట్ర మంత్రులు ఇద్దరి నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలున్న వనపర్తి డిసిసి పీఠం కోసం ఒకరకంగా హోరాహోరీ పొలిటికల్ పోరు నడుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో చనిపోయిన కార్మికుల శరీర భాగాలను సేకరించి.. పటాన్ చెరువు ప్రభుత్వ ఆస్పత్రి మార్చరీకి తరలించారు. ఈ సందర్భంగా మార్చరీలో ఉన్న మృతదేహాలకు వారి కుటుంబ సభ్యుల డీఎన్ఏతో మ్యాచ్ చేసి అప్పగిస్తున్నారు. అయితే, ఈ రోజు మరో 13 మృతదేహాలను అధికారులు గుర్తించారు.
KCR: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య పరీక్షల కోసం యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్‌కు డాక్టర్లు పలు పరీక్షలు చేస్తున్నారు. ఆయన వెంట సతీమణి శోభ, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు మాజీ ఎంపీ సంతోష్ కూడా వెళ్లారు. గతంలోనూ కేసీఆర్ అనారోగ్య సమస్యతో యశోద ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు.
Group-1 Exam: గ్రూప్-1 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య విషయంలో ఎలాంటి తేడా లేదన్నారు. నామినల్ రోల్స్, అభ్యర్థుల వేలిముద్రల ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడించినట్లు చెప్పారు.
Telangana Govt: అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంగన్వాడి టీచర్లుగా ప్రమోషన్ పొందే హెల్పర్ల గరిష్ట వయోపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం వల్ల 45 ఏళ్లు దాటిన హెల్పర్లకు ప్రయోజనం చేకూరనుంది.