* అమరావతి: ఇవాళ p4 పై సీఎం చంద్రబాబు.. ఉన్నత స్థాయి సమీక్ష. నియోజక వర్గాల్లో p4 ప్లానింగ్ పై చర్చ.. బంగారు కుటుంబాలకు చేసే ఆర్ధిక సహాయం…ఆయా నియోజక వర్గాల్లో ఉన్న బంగారు కుటుంబాల డేటాపై సమీక్ష.
* హైదరాబాద్: నేడు సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్.. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై.. కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న సీఎం..
* కడప: నేడే పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు.. రెండు చోట్ల భారీగా పోలీసుల మోహరింపు.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్
* కడప: పులివెందుల ఎన్నికల బరిలో 11 మంది అభ్యర్థులు… మొత్తం 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు… ఓటు హక్కు వినియోగించుకోనున్న 10601 మంది ఓటర్లు…
* కడప: ఒంటిమిట్టలో ఎన్నికల బరిలో ఉన్న 11 మంది అభ్యర్థులు… మొత్తం 17 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు.. ఒంటిమిట్టలో 24606 మంది ఓటర్లు
* అమరావతి : ఇవాళ తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశం..
* విజయవాడ: NMUA ఆధ్వర్యంలో ఇవాళ, రేపు ఏపీఎస్ఆర్టీసీ అన్ని యూనిట్లలో ధర్నా, ఉద్యోగులకు రావలసిన డిఏ, పదవీ విరమణ చెందిన ఉద్యోగుల సెంటిల్మెంట్ బకాయిల విడుదల, ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆపాలి.. సంస్థలో పెండింగ్లో ఉన్న అనేక సమస్యల పరిష్కారం చేయాలి డిమాండ్
* తూర్పుగోదావరి జిల్లా అనపర్తి: నేడు అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం వడిశలేరులో ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటన.. వడిసలేరులో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తో కలిసి తిరంగ యాత్రలో పాల్గొననున్న మంత్రి సత్య కుమార్ యాదవ్
* శ్రీకాకుళం జిల్లా: నరసన్నపేట మండలం పద్మావతి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా.. హాజరు కానున్న11 ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు. 500 జాబులు భర్తీ చేయనున్నా కంపెనీలు. 9 గంటలకు ప్రారంభం కానున్న జాబు మేళ. ముఖ్యఅతిథిగా హాజరవుతున్న స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
* హైదరాబాద్: ఈ రోజు న్యాక్ లో ఉదయం 11 గంటలకు హ్యామ్ రోడ్లపై కీలక సమావేశం.. మంత్రి కోమటిరెడ్డి అధ్యక్షతన భేటీ.. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి, హాజరుకానున్న మంత్రి సీతక్క, సీఎస్ రామకృష్ణ రావు..
* కాకినాడ: నేడు కాకినాడ లో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనున్న హీరోయిన్ నిధి అగర్వాల్
* విజయవాడ: లిక్కర్ స్కాం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లు మీద నేడు తీర్పు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు.. నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్ల పై తీర్పు.. ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ముగ్గురు నిందితులు