CM Revanth Reddy: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఇండస్ట్రియల్ పార్క్లో మలబార్ జెమ్స్ తయారీ యూనిట్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అన్నారు.
Sigachi Factory Blast: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సమీపంలోని ఫార్మా కారిడార్ లోని పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ప్రమాదంలో సుమారు 45 మందికి పైగా కార్మికులు మృతి చెందారు. అయితే, పేలుడు ధాటికి ఘటన స్థలంలో పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల శరీర భాగాలు పూర్తిగా చిద్రం అయిపోయాయి.
కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. ఆయన వస్తే అన్ని అంశాలపై చర్చ జరుపుతాం.. హరీష్ రావు, కేటీఆర్ తో మాకు సంబంధం లేదని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కేసీఆర్, మేము ఉద్యమంలో పని చేశామని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణలో కీలక అంశాలు ప్రస్తావించారు. అప్పటి మున్సిపల్ శాఖ మినిస్టర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని ఏసీబీ విచారణలో అరవింద్ కుమార్ తెలిపారు. HMDW ఖాతా నుంచి FEO కంపనీకి నిధులు మల్లింపుపై నా ప్రమేయం ఆయన లేదని తేల్చి చెప్పారు.
Kakatiya University: వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించొద్దని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగాయి. రిజిస్టర్ ఛాంబర్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు పీసీసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కవిత బీఆర్ఎస్ నాయకురాలుగా లెటర్ రాసిందా, జాగృతి నాయకురాలుగా రాసిందా అని ప్రశ్నించారు. మేము బీసీల కోసం వాగ్దానం చేసిన రోజు కవిత తీహార్ జైల్లో ఊసలు లెక్కపెడుతుంది అని ఎద్దేవా చేశారు.
బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. వందేళ్ల నుంచి గోదావరిలో ఏటా సగటున 2 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోతోందన్నారు. వృథా అవుతున్న నీటిని వినియోగించుకునేందుకే బనకచర్ల ప్రాజెక్టు అని తెలిపారు. ఎగువ ఉన్న తెలంగాణ వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుంటే తాను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని, ఇకపై కూడా చెప్పను అని చెప్పారు. సముద్రంలోకి పోయే నీళ్లను వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.…
ఆ యువకుడిది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. తండ్రి జీతం ఉంటూ, తల్లి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఈ సమయంలో ఆ యువకుడు తన తమ్ముళ్లని చెల్లిని ఆడించేవాడు. తొమ్మిదేళ్ల వయసులో తండ్రి జీతం ఉన్న ఇంట్లోనే పశువుల కాపరిగా చేరి నాలుగేళ్లు పనిచేసి కుటుంబానికి అండగా నిలిచాడు. అప్పటికి యువకుడి వయసు 13 ఏళ్లు. బడి అంటే ఏంటో తెలియదు. ఆ సమయంలో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అతడిని…
సంగారెడ్డి జిల్లా చేర్యాల గేటు వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఫిల్మ్ నగర్ ఎస్సై రాజేశ్వర్ గౌడ్ మృతి చెందారు. బల్కంపేటలో బందోబస్తుకు వచ్చిన రాజేష్ గౌడ్.. బందోబస్తు ముగించుకొని కార్ లో తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో లారీని వెనుకాల నుంచి కార్ డీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఎస్సై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై రాజేశ్వర్ స్వస్థలం సంగారెడ్డిలోని చాణక్యపురి కాలని. రోడ్డు ప్రమాదంలో…
అధికారం కోల్పోయాక బీఆర్ఎస్లో సంక్షోభం.. ఒకవైపు సొంత కూతురు ధిక్కార స్వరం, మరోవైపు మేనల్లుడు హరీష్రావు అలక. ఇంకోవైపు కాళేశ్వరం కమిషన్ నోటీసులు, కొడుకు కేటీఆర్ ఏసీబీ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు.. ఇలా ఎటు చూసినా కేసీఆర్కు ఇబ్బందికర పరిస్థితులే. ఆయనకున్న నమ్మకాల కోణంలో చెప్పాలంటే.. గ్రహాలు కలిసిరాలేదు.