TRS Vs Congress: సీతక్కపై కాంగ్రెస్ ట్వీట్ .. టీఆర్ఎస్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీ పర్యటనతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. వరంగల్ సభతో రాహుల్ గాంధీ అద్భుతంగా ప్రసంగించారని.. కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. ఐతే రాహుల్ పర్యటన నేపథ్యంలో ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిన్న వరంగల్ సభ సందర్భంగా.. రాహుల్ గాంధీ చేతికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క కాశీ తాడును కట్టారు. ఆ సమయలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చేతిని పట్టుకోగా.. సీతక్క తాడును కట్టారు. ఆ ఫొటోను కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ సీతక్కను ఎమ్మెల్యే అనకుండా.. ‘మహిళా రైతు’ అని పేర్కొనడమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
‘ఓ మహిళా రైతు రాహుల్ గాంధీ చేతికి కాశీదారం కట్టింది. కాంగ్రెస్ అంటే మార్పును తీసుకొచ్చే ఒక నమ్మకం. తెలంగాణ మార్పును కోరుకుంటోంది.’ అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. సీతక్క గురించి కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read
సీతక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ములుగు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ ప్రజల్లో ఆమెకు ఎంతో మంచి పేరుంది. జననేతగా పిలుచుకుంటారు. ఆడంబరాలకు పోకుండా.. సామాన్య మనిషిలా బతుకుతారు. నిత్యం జనాల్లో తిరుగుతూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటారు. అలాంటి సీతక్క గురించి కాంగ్రెస్ పార్టీకి తెలియదా? ఎమ్మెల్యే అని కాకుండా.. మహిళా రైతు అని పేర్కొంటారా? ఆమె అభిమానులు విమర్శిస్తున్నారు.
మరోవైపు ఈ ట్వీట్‌పై టీఆర్ఎస్ పార్టీ తమదైన స్టైల్లో విమర్శలు గుప్పించింది. రైతు పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆ పార్టీ నేత క్రిశాంక్ ట్వీట్ చేశారు. ”తప్పుడు ప్రచారం చేయడంలో బీజేకీ కంటే కాంగ్రెస్ ఏమాత్రమూ తక్కువ కాదు. ఆ ఫొటోలో ఉన్న మహిళ.. రైతుకాదు.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. రైతు పేరుతో రాజకీయాలు చేస్తున్నారు.” అని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా ఆ ట్వీట్‌పైఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సీతక్క అభిమానులేమో.. ఆమెను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీయేమో.. రైతుల పేరుతో రాజకీయాం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తోంది. ఐతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం.. ఇది అడ్మిన్ తప్పిదం వల్ల జరిగిందని.. ఢిల్లీలో ఉండే వారికి సీతక్క గురించి తెలియకపోవచ్చు.. అంత మాత్రానికే.. ఇంత రచ్చ చేయాలా అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా షోషల్ మీడియాలో ఒక ఎమ్మెల్యేపై అలా ట్విట్ చేయడం సరికాదని అంటున్నారు.
తాజావార్తలు
-
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
-
Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
-
Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!