Jagadish Reddy: ఈ డిక్లరేషన్ ఏఐసీసీదా? పీసీసీదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నిర్వహించిన రైతు సంఘర్షణ సభపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. వరంగల్ సభపై మంత్రి జగదీష్ రెడ్డి తనదైన రీతిలో కామెంట్లు చేశారు. కాంగ్రెస్ హామీలు నీటి మూటలే అన్నారు. దారిపోయే దానయ్యలు మాట్లాడితే నమ్మడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కారు. రాసిచ్చిన చిలుక పలుకులు తప్ప రాహుల్ గాంధీ మాటల్లో పసలేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.
రాహుల్ గాంధీ ఏ హోదాలో మాట్లాడారో చెప్పాలన్నారు. ఏ.ఐ.సి.సి ప్రతినిధిగానా…పీసీసీ ప్రతినిధిగా ఆయన మాట్లాడారో చెప్పాలన్నారు. ఆ డిక్లరేషన్ ఏఐసీసీదా… పీసీసీదా? దేశానికి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా అవలంబిస్తుందా? కాంగ్రెస్ పార్టీకి జాతీయ విధానం అంటూ ఒకటి ఉందా? పూటకో మాదిరిగా ఊరికో మాదిరిగా మాట్లాడతారా? ఏ ఐసీసీ, పీసీసీలు తయారు చేసిన డిక్లరేషన్ కాదు. డిక్లరేషన్ ఇచ్చే అర్హత రాహుల్ గాంధీకి లేదు. ఉన్న తెలంగాణాను ఊడగొట్టి ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు.
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
60 సంవత్సరాలుగా తెలంగాణా ప్రజల ఉసురు తీసిందే కాంగ్రెస్. తెలంగాణా ను ఆంధ్రలో కలిపేనాటికి కుదిరిన పెద్దమనుషుల ఒప్పందంలో అక్షరం ముక్క అమలుకు నోచుకోలేదు. గిర్ గిలానీ కమిటీ,ఫజల్ అలీ కమిషన్,6 పాయింట్ ఫార్ములా,610 జిఓ లు అమలుకు నోచుకోలేదు. ఆరు దశాబ్దాల కాలంలో ఏ ఒక్కటి అమలు కాలేదు. తెలంగాణా ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు అయిన చరిత్ర లేదు. వరంగల్ సభతో తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీలేదు. ఏ ఐ సి సి నాయకుడు వస్తాడు,ఎదో చేస్తాడన్న భ్రమలు తెలంగాణా ప్రజలకు ఏమీ లేవు. 8 ఏండ్లుగా ఈ రాష్ట్ర నాయకులు ఏమి మాట్లాడుతున్నారో తప్ప ఢిల్లీ నుండి కొత్తగా ఢిల్లీ నుండి వచ్చిన మాట ఒక్కటి లేదు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు రాసిచ్చిన చిలుక పలుకులు. 2018 ఎన్నికల్లో కుడా ఇవే హామీలు ఇచ్చారు. తెలంగాణా ప్రజలు ఆనాడు నమ్మలేదు…ఈ రోజు నమ్మరు…రేపు నమ్మబోరు అని ఎద్దేవా చేశారు మంత్రి జగదీష్ రెడ్డి.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!