తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల్లో భాగంగా.. ఈరోజు జరిగిన సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షకు 20,921 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 4,37,865 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 4,16,964 మందే పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. మొత్తంగా 4.7% విద్యార్థులు గైర్హాజరైనట్టు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇండిర్మీడియట్ ఎడ్యుకేషన్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్‌లలో ఒక్కోటి చొప్పున మూడు మాల్ ప్రాక్టీస్ కేసులు…
హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఒకవైపు మదర్స్ డే వేడుకలకు ప్రపంచం సిద్ధం అవుతోంది. అయితే హైదరాబాద్ లో ఓ కొడుకు తల్లిని దారుణంగా చంపేశాడు. జంగయ్య,భూదేవి (58)అలియాస్ లక్ష్మి దంపతులు దిల్ సుక్ నగర్ న్యూ గడ్డి అన్నారం కాలనీలో నివాసముంటున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో సాయి తేజ అనే యువకుడిని దత్తత తీసుకున్నారు. అతని వయసు 27 సంవత్సరాలు. శుక్రవారం రాత్రి జంగయ్య కింద గ్రౌండ్ ఫ్లోర్…
ఒకవైపు సూరీడు మండిపోతున్నాడు. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఉక్కపోత.. వీటి నుంచి సేద తీరేందుకు మద్యం ప్రియులు చిల్డ్ బీర్ కావాలంటున్నారు. గత కొన్నాళ్ళుగా ఎండలు ఎక్కువవటంతో బీర్ల అమ్మకాలు బాగా పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ సారి ఏకంగా 90 శాతం అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. విస్కీ, ఇతర మద్యం అమ్మకాలు కూడా 3 శాతం పెరిగాయి. అన్ని రకాల మద్యం అమ్మకాలు సేల్ వాల్యూపరంగా చూస్తే గత…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రానికి వచ్చిన రాహుల్ గాంధీ.. శనివారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ నేతలెవరూ హైదరాబాద్‌లో ఉండొద్దని, ఢిల్లీకి అసలే రావొద్దని చెప్పిన ఆయన.. ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పారు. వరంగల్ డిక్లరేషన్ గురించి రాష్ట్రంలోని ప్రజలకు వివరించాలని, ప్రతి ఒక్కరూ ప్రజల మధ్యే తిరగాలని సూచించారు. కేవలం ప్రెస్మీట్లు పెట్టి మాటలతో సరిపెట్టుకుండా.. నేతలందరూ…
అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అంటుంటారు. ఆ గ్రామంలో రైతులు కోటీశ్వరులు.. అక్కడ ఎకరం కోటికి పైగా ధర పలుకుతుంది. కొంచెం భూమి అమ్మితే డూప్లెక్స్ ఇళ్లు కట్టుకోవచ్చు.. ఆకాశమంత పందిరి వేసి.. భూదేవంత అరుగు పై ఆడ పిల్లల పెళ్ళి చేయవచ్చు. కానీ ఆ ఉళ్లో ఆడ బిడ్డలకు కళ్యాణ యోగం కలగడం లేదు. అన్నీ కుదిరినా పెళ్ళిళ్ళు మాత్రం వాయిదా వేస్తున్నారు. కట్నం ఇవ్వరని వరుడు తరపు బంధువులు పెళ్ళిళ్ళకు నో…
నిన్న అట్టహాసంగా వరంగల్‌లో కాంగ్రెస్ నిర్వహించిన రైతు సంఘర్షణ సభపై టీఆర్ఎస్ మంత్రలు వరుస పంచ్‌లు వేస్తున్నారు. తాజాగా ట్విటర్ మాధ్యమంగా మంత్రి హరీశ్ రావు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ‘‘రాహుల్ గాంధీగారూ, వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతాంగమే మిమ్మల్ని ఈడ్చి తన్నింది. పంజాబ్ రైతులు నమ్మని మీ రైతు డిక్లరేషన్ – చైతన్యవంతులైన తెలంగాణ రైతులు నమ్ముతారా? ఇది రాహుల్ సంఘర్షణ సభ – రైతు సంఘర్షణ సభ కాదని తెలంగాణ ప్రజానీకం…
రాహుల్ గాంధీ.. తెలంగాణ టూర్ పై బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ స్పందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చెయ్యని పనులు ఇప్పుడు చేస్తామంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదని అన్నారు. కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు.. రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైందని సెటైర్ వేశారు. అధికారం ఉన్నచోట కోల్పోతున్న కాంగ్రెస్, ప్రజలను మభ్య పెడుతోందని డా.లక్ష్మణ్ పేర్కొన్నారు. డబుల్ ఇంజన్…
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ.. ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులందరికీ పాదాభివందనాలు చేస్తున్నానని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్‌టైల్ పార్కులో ఏర్పాటు చేస్తున్న కిటెక్స్ టెక్స్టైల్ పరిశ్రమకు భూమిపూజ చేసిన సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. కిటెక్స్ టెక్స్ టైల్స్ పరిశ్రమతో పరకాల నియోజకవర్గంలోని వేలాది మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. రైతులు కష్టమైనా, నష్టమైనా ఓర్చుకొని ఇబ్బందైనా తట్టుకొని భూములు ఇచ్చిన వారందరికీ పేరుపేరునా…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని పప్పు అంటూ ఎద్దేవా చేశారు తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి. శనివారం మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండల పరిధిలోని ఉద్ధమర్రి, కేషవరం గ్రామాల్లో ధాన్యంకొనుగోలు కేంద్రాన్నిమంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. రైతు పండించిన ప్రతి గింజ కూడా తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. Read Also: Alluri Sitarama Raju: ఏడాది పాటు అల్లూరి జయంతి ఉత్సవాలు.. రైతు సంఘర్షణ్ అంటూ వచ్చిన పప్పు రాహుల్ ముందు…
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైమవతి (25), నాగరాణి(23) అనే ఇద్దరు యువతులు గచ్చిబౌలి DLF వద్ద నివాసం ఉంటున్నారు. నాగరాణి ఓప్రైవేట్ హాస్పిటల్ లో నర్స్ గా పని చేస్తోంది. నిన్న రాత్రి హైమవతి ,నాగరాణి ఇద్దరు ద్విచక్ర వాహనంపై DLF నుండి గచ్చిబౌలి స్టేడియం వైపు వెళ్తుండగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో నాగరాణికి తీవ్ర రక్తస్రావ్యం కావడంతో.. అక్కడికక్కడే మృతి చెందగా..…