రాహుల్ గాంధీ పర్యటనతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. వరంగల్ సభతో రాహుల్ గాంధీ అద్భుతంగా ప్రసంగించారని.. కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. ఐతే రాహుల్ పర్యటన నేపథ్యంలో ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిన్న వరంగల్ సభ సందర్భంగా.. రాహుల్ గాంధీ చేతికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క కాశీ తాడును కట్టారు. ఆ సమయలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చేతిని పట్టుకోగా..…
కొత్త థియేటర్లో పాత సినిమా లాగా కాంగ్రెస్ సభ ఉందని టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. ఆ సభ కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ కాదని.. కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రెషన్ అని అన్నారు. చావు నోట్లో తలపెట్టి, రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. బైండోవర్ కేసులు పెట్టి నిర్బంధించారని బాల్క సుమన్ పేర్కొన్నారు. పండుగలు కూడా చేసుకోలేదని బాల్క సుమన్ పేర్కొన్నారు. Read Also: Minister Niranjan Reddy: టీఆర్ఎస్ను క్షమించం అనేందుకు రాహుల్ ఎవరు..? చంద్రబాబుకు ఏజెంట్‌గా…
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ విడుదల చేసిన వరంగల్ డిక్లరేషన్‌పై టీఆర్ఎస్ నేత, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్తున్న కాంగ్రెస్.. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతు రుణమాఫీని అమలు చేస్తున్నదా? అని రాహుల్‌గాంధీని మంత్రి నిరంజన్ రెడ్డి నిలదీశారు. రాహుల్ గాంధీ డిక్లరేషన్ పై మంత్రి మీడియాతో మాట్లాడారు. తెరాసను క్షమించం అనేందుకు రాహుల్ ఎవరని…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్లు , పంటలు దెబ్బతిన్నాయన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ లోని ప్రధాన ఆలయమైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి పరిసరాలు కూడా వర్షపునీటితో దెబ్బతిన్నాయి. ప్రధానాలయ పరిసరాలు, క్యూలైన్లు వర్షం నీటితోపాటు లీకవుతున్న ప్రధానాలయం మండపాలకు మరమత్తులు మొదలు పెట్టారు. ఈ మేరకు ఆలయ అధికారులు వర్షం కారణంగా జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకొని పనులకు సిద్దమైనారు. సన్నిధిలో ఎక్కడెక్కడ వర్షపు నీరు చేరి మట్టి పేరుకపోయిందో…
సరూర్ నగర్ పరువు హత్య కేసుపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. నాగరాజు హత్యను ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఆశ్రిన్ సుల్తానా తన ఇష్టపూర్వకంగానే నాగరాజును పెళ్లి చేసుకుందని… అది సరైందేనని ఒవైసీ అన్నారు. సుల్తాన్ సోదరుడు ఆమె భర్తను హత్య చేయడం క్రూరమైన చర్య అని తెలిపారు. రాజ్యాంగం ప్రకారమైనా, ఇస్లాం ప్రకారమైనా… ఇది నేరపూరిత చర్య అన్నారు. హైదరాబాద్ దారుస్సలాంలో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు…
నేడు హన్మకొండ, వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే.. ఉదయం 10 గంటలకు వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు శాయంపేట హవేలికి చేరుకుంటారు మంత్రి కేటీఆర్. 10.15 గంటలకు కైటెక్స్ టెక్స్టైల్ పార్కు భూమి పూజ , మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన , యంగ్వన్ ఫొటో డెమో కార్య క్రమం , గణేష్ ఎకోపెట్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవం , అనంతరం అధికారులు , ప్రజాప్రతినిధులతో సమావేశం…
* ఐపీఎల్లో నేడు రెండు మ్యాచ్‌లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు పంజాబ్‌తో రాజస్థాన్ ఢీ, రాత్రి 7.30 గంటలకు లక్నోతో కోల్‌కతా మ్యాచ్ * హైదరాబాద్‌లో నేడు రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటన, ఉదయం 10 గంటలకు ఉద్యమకారులతో రాహుల్ సమావేశం, దామోదరం సంజీవయ్యకు నివాళులర్పించనున్న రాహుల్, చంచల్‌గూడ జైలులో ఎన్ఎస్యూఐ నేతలను కలవనున్న రాహుల్ గాంధీ * ఏపీలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు కేంద్ర బృందం పర్యటన, నేడు కడప జిల్లాలో భూములు పరిశీలించనున్న…
వరంగల్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నిర్వహించిన రైతు సంఘర్షణ సభపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. వరంగల్ సభపై మంత్రి జగదీష్ రెడ్డి తనదైన రీతిలో కామెంట్లు చేశారు. కాంగ్రెస్ హామీలు నీటి మూటలే అన్నారు. దారిపోయే దానయ్యలు మాట్లాడితే నమ్మడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కారు. రాసిచ్చిన చిలుక పలుకులు తప్ప రాహుల్ గాంధీ మాటల్లో పసలేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. రాహుల్ గాంధీ ఏ హోదాలో మాట్లాడారో చెప్పాలన్నారు. ఏ.ఐ.సి.సి ప్రతినిధిగానా…పీసీసీ ప్రతినిధిగా ఆయన…
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విటర్ మాధ్యమంగా సెటైర్స్ వేశారు. ‘‘పొలిటికల్ టూరిస్టులు రావొచ్చు, వెళ్ళొచ్చు. ఒక్క కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణలో ఉంటారు’’ అంటూ తనదైన శైలిలో పంచ్ వేశారు. అంతేకాదు, ఆ డైలాగ్‌కి తగ్గ ఉన్న మేనరిజం ఫోటోను కూడా షేర్ చేశారు. అయితే, ఆ వెంటనే రేవంత్ రెడ్డి కూడా ఆయనకు కౌంటర్ వేశారు. ‘‘కేటీఆర్ గారు.. మీ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్ట్ ప్లేస్…
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీ కొనడంతో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఊరుకొండ మండలానికి చెందిన బాల స్వామి గౌడ్, శివయ్య, యాదయ్య గౌడ్, అంజమ్మ, అనిత, తేజ ఇంద్రకల్ నుంచి దేవరకొండ మండలం తాటికోల్ గ్రామంలో వివాహానికి హాజరై తిరిగి తమ గ్రామానికి వెళ్తున్నారు. హైదరాబాద్‌కు…