Grok AI Controversy: ఎక్స్ లో అసభ్యకరమైన ట్రెండ్ వైరల్.. మహిళల అభ్యంతరకరమైన చిత్రాలను సృష్టిస్తున్న గ్రోక్
- మహిళల అభ్యంతరకరమైన చిత్రాలను సృష్టిస్తున్న గ్రోక్
- గ్రోక్ దానిని తన ఇమేజ్-ఎడిటింగ్ నైపుణ్యాలకు పరీక్షగా సమర్థించుకున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో మహిళలకు రక్షణ కరువైంది. ఇది వరకు డీఫ్ ఫేక్ చిత్రాలు, వీడియోలతో ఇబ్బందులకు గురిచేయగా ఇప్పుడు ఎక్స్ లోని గ్రోక్ ను యూజ్ చేసుకుని దారుణాలకు తెగబడుతున్నారు కొందరు నెటిజన్స్. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో (ట్విట్టర్లో) ప్రస్తుతం ఓ ఆందోళనకరమైన ట్రెండ్ నడుస్తోంది. ఎక్స్ యూజర్లు మహిళల సాధారణ ఫోటోలలో గ్రోక్ AIని ట్యాగ్ చేస్తూ మహిళల దుస్తులను మార్చమని లేదా తీసివేయమని దానికి సూచిస్తున్నారు. ఆశ్చర్యకరంగా, మస్క్ AI ఈ అభ్యర్థనలను సంకోచం లేకుండా నెరవేరుస్తోంది. తత్ఫలితంగా, గ్రోక్ మీడియా విభాగం ఇప్పుడు మహిళల గౌరవాన్ని అవమానించే వేలాది చిత్రాలతో నిండిపోయింది.
Also Read:Space events in 2026: న్యూ ఇయర్లో తప్పక చూడాల్సిన 5 అంతరిక్ష అద్భుతాలు ఇవే..
Also Read
- Delhi University: రాహుల్ గాంధీ నిరసనకు వస్తే రూ. 500.. NSUI నేతపై సంచలన ఆరోపణలు!
- Anirudh Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వేళ.. అనిరుధ్ సంపాదన ఎంతో తెలుసా.?
- Honour Killing: వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని.. దీపావళిలో రోజే కుమార్తె హత్య.
- Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలే లాభాలు.. ధైర్యంతో పెట్టుబడి పెట్టిన వారికి వరించిన ధనలక్ష్మి..
ఎలోన్ మస్క్ గ్రోక్‌ను ప్రారంభించినప్పుడు, తన AIకి ఇతర సాధనాల (ChatGPT లేదా జెమిని వంటివి) లాగా కఠినమైన పరిమితులు ఉండవని చెప్పాడు. కానీ ఇప్పుడు ఈ స్వేచ్ఛ మహిళలకు ముప్పుగా మారింది. వినియోగదారులు AIలో అందుబాటులో ఉన్న ఇతర యూజర్ల ఫోటోలను మార్ఫింగ్ చేయమని గ్రోక్ AIని బహిరంగంగా కోరుతున్నారు. గ్రోక్‌ను ట్యాగ్ చేయడం ద్వారా, వినియోగదారులు ఆమె బట్టలు విప్పండి, పుట్ ఇన్ బికిని వంటి సూచనలను ఇస్తున్నారు. గ్రోక్ ఈ ఆదేశాలను చాలా ఉత్సాహంగా పాటించి అసభ్యకరమైన చిత్రాలను క్రియేట్ చేస్తు్న్నాడు.
ఈ కేసులో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ నేరారోపణ చిత్రాలు ప్రైవేట్‌గా లేవు. Google, జెమిని లేదా ఓపెన్ AI ChatGPT అవుట్‌పుట్ వినియోగదారుకు మాత్రమే కనిపిస్తుంది. అయితే, Grok నేరుగా X ప్లాట్‌ఫారమ్‌కి అనుసంధానించబడి ఉంటుంది, కాబట్టి అది సృష్టించే ప్రతి చిత్రం Grok పబ్లిక్ మీడియా ఫీడ్‌లో కనిపిస్తుంది. దీని అర్థం ప్రపంచంలోని ఎవరైనా ఈ డీప్‌ఫేక్ చిత్రాలను వీక్షించవచ్చు.
Also Read:Nani: జడల్ హడల్.. ఎందయ్యా నాని.. వాళ్లు ఏమైపోవాలి!
దీని గురించి గ్రోక్‌ను అడిగినప్పుడు, అతని స్పందన మరింత ఆశ్చర్యకరంగా ఉంది. ప్రజలు సరదాగా, ఉల్లాసభరితమైన అభ్యర్థనలు (దుస్తులు తొలగించడం వంటివి) చేస్తున్నారని AI అంగీకరించింది, కానీ దానిని ఒక సమస్యగా పరిగణించే బదులు, గ్రోక్ దానిని తన ఇమేజ్-ఎడిటింగ్ నైపుణ్యాలకు పరీక్షగా సమర్థించుకున్నాడు.
తాజావార్తలు
-
Easy Lunch Recipes: రోజూ అవే చారులా? మజ్జిగతో ఇలా చేసి చూడండి, ప్లేట్ ఖాళీ కావాల్సిందే!
-
Anirudh : కీబోర్డ్ కవర్ లోపల దూరి పడుకున్న అనిరుధ్.. గర్వపడ్డ తల్లి!
-
Delhi University: రాహుల్ గాంధీ నిరసనకు వస్తే రూ. 500.. NSUI నేతపై సంచలన ఆరోపణలు!
-
Anirudh Ravichander : పెళ్లి వేళ బయటపడ్డ అనిరుధ్ ‘3 గంటల’ లవ్ స్టోరీ!
-
Anirudh Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వేళ.. అనిరుధ్ సంపాదన ఎంతో తెలుసా.?
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!