Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2026 నూతన సంవత్సరాన్ని తన స్టాఫ్‌తో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను అల్లు అర్జున్ టీమ్ అధికారిక అకౌంట్ నుంచి పంచుకుంది.. స్టాఫ్‌తో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న బన్నీ ఫోటోలు ఆయన ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
READ ALSO: FASTag KYV: ఫాస్ట్ ట్యాగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. NHAI కీలక నిర్ణయం
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తన ప్రయాణంలో తోడుగా, వెన్నంటే నిలిచిన తన స్టాఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్ట్ కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మనసును దోచుకునే హార్ట్ ఉన్న వ్యక్తిగా పేరున్న అల్లు అర్జున్.. తనతో పనిచేసే వారిని కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారని సినీ సర్కిల్‌లో చెబుతుంటారు. ఈ స్వాగ్ పార్టీలో స్టాఫ్ అందరూ పాల్గొని ఆనందంగా న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. “తన దగ్గర పనిచేసే వారిని కూడా కుటుంబంలా చూడటం అల్లు అర్జున్ స్పెషాలిటీ” అంటూ ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. పుష్ప 2 సక్సెస్ తర్వాత ఆయన ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో కొత్త ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు.
READ ALSO: AP Liquor Sales: రూ.2,767 కోట్ల అమ్మకాలు.. లిక్కర్ సేల్స్‌కు ప్రధాన కారణాలు ఇవే!