తెలంగాణకు కొత్త ప్రాజెక్టులు వస్తూనే ఉన్నాయి.. ముఖ్యంగా రాజధాని చుట్టూ కొత్త సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది గ్రిడ్ డైనమిక్స్ కంపెనీ.. ఈ సంవత్సరాంతానికి ఇక్కడి నుంచి సుమారు 1000 మంది ఉద్యోగులు కంపెనీ కోసం పని చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.. Read Also: Sonia Gandhi: సీడబ్ల్యూసీ సమావేశం.. సోనియా కీలక వ్యాఖ్యలు.. ప్రముఖ డిజిటల్ కన్సల్టింగ్ కంపెనీ గ్రిడ్ డైనమిక్స్ కంపెనీ…
తెలంగాణ రాజకీయాల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చుట్టూ చర్చ సాగుతూనే ఉంది.. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో చేరతారు? అనే ప్రశ్న అందరినీ తొలచివేస్తోంది. అయితే, ఆయన ఏ పార్టీ నేతలను కలిసినా.. ఆ పార్టీలో చేరతారు అనే ప్రచారం ఎప్పటికప్పుడు సాగుతూనే ఉంటుంది. తాజాగా, ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో సమావేశం కావడంతో.. మరోసారి పొలిటికల్ పార్టీ రీ ఎంట్రీ చర్చ తెరపైకి వచ్చింది. అయితే, తాను ఏ…
టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పనితీరుపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ వరసగా ట్వీట్లు చేస్తున్నారు. గ్యాస్ ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్భనం ఇలా ప్రతీ అంశంపై ట్విట్టర్ వేదికపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర అవలంభిస్తున్న తీరుతో పాటు తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్ర ప్రాజెక్టుల్లో తెలంగాణకు మొండిచేయి చూపడంపై కేటీఆర్ మోదీ సర్కార్ ను విమర్శిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత కూడా కేంద్రంపై ట్విట్టర్…
సరిలేరు నీకెవ్వరు తరువాత ‘ సర్కార్ వాటి పాట’ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. థమన్ అందించిన మ్యూజిక్, బీజీఎంకు కూడా అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే ‘కళావతి’ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది. దీంతో పాటు ‘ మ మ మషేషా’ సాంగ్ కూడా దుమ్ము రేపుతోంది. ఈనెల…
కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేవారు. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. కుటుంబ సభ్యుడు మరణించడంతో దశదిన కర్మలో భాగంగా అంగడి దింపుడు కార్యక్రమానికి ఎల్లారెడ్డి పట్టణం సంతకు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా హాసన్ పల్లి గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడంతో పాటు మరో 14మంది గాయపడ్డారు.…
తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఏర్పడింది. ఒకవైపు పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్, మంత్రుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇటు టీఆర్ఎస్ మంత్రులు సైతం బీజేపీ నేతల్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీజేపీ నేతల్ని టార్గెట్ చేశారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఏమి లేని ఆకు ఎగిరి ఎగిరి పడతదంట…..అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటదంట. ఏమి లేని ఆకు లాగా…
రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో పదేళ్లపాటు అధికారం చేపట్టిన పార్టీ కాంగ్రెస్. తెలంగాణ ప్రస్తుతం కాంగ్రెస్‌ది ప్రతిపక్ష పాత్ర. రాజకీయ భవిష్యత్‌ను వెతుక్కుంటూ అనేకమంది నాయకులు ఎన్నికల సమయంలోనూ.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హ్యాండిచ్చేశారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పుంజుకొనే పనిలో ఉంది. అయితే రాజధాని హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ పరిస్థితి విచిత్రంగా మారింది. జిల్లాల విభజన తరువాత కొత్త జిల్లాలకు నేతలు కరువైయ్యారు. అనేక ఆటుపోట్ల మధ్య…
దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 3,207 కేసులు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా 29 మంది చనిపోయారు. మరో 3410 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.05 శాతంగా ఉంది. దేశంలో మొత్తం కరోనా కేసులు 4,31,05,401గా నమోదయ్యాయి. మొత్తం మరణాలు 5,24,093గా నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసులు 20,403గా…
★ ఏపీ హైకోర్టుకు నేటి నుంచి జూన్ 10 వరకు వేసవి సెలవులు.. సెలవుల్లో అత్యవసర పిటిషన్ల విచారణకు వెకేషన్ కోర్టులు ★ నెల్లూరు జిల్లాలో నేడు మంత్రి అంబటి రాంబాబు పర్యటన.. పెన్నా, సంగం బ్యారేజీల సందర్శన.. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం ★ శ్రీకాకుళం : నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం.. హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ★ గుంటూరు: నేడు డీజీపీని కలవనున్న బీజేపీ నేతలు.. సత్యసాయి జిల్లాలో…