Kishan Reddy: ఖైరతాబాద్ నియోజకవర్గంలోని వివిధ బస్తీల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బస్తీ వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్‌లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026లో అందరికీ శుభం కలగాలని, భగవంతుడి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
READ ALSO: Revanth Reddy: కేసీఆర్ పెట్టిన సంతకం ఏపీకి అడ్వాంటేజ్.. కృష్ణా జలాల్లో తెలంగాణకు 71 శాతం రావాలి!
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేశంలో ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నామన్నారు. తాను ప్రజలను కోరేది ఒకటే అని.. ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలపర్చాలని, ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా, ప్రపంచంలో భారత్ విశ్వగురువుగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దేశంలో మౌలిక వసతుల కల్పన, పేద ప్రజల సంక్షేమం, శాంతి భద్రతల పరిరక్షణ, విదేశీ, ఆర్థిక, జీఎస్టీ సంస్కరణలు, విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. తెలంగాణకు 70 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుందని, హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ చాలా ముఖ్యమైనవి అని, అయితే ప్రస్తుతం ఈ రెండింటికి నిధుల కొరత ఉందని అన్నారు.
గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బస్తీల్లో పాదయాత్ర చేసి, తెలుసుకున్న సమస్యలను జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేస్తే సాయంత్రం లోపు పరిష్కరించేవారని, ఇప్పుడు సాయంకాలం లోపు కాదు కదా సంవత్సరం గడిచిన సమస్య పరిష్కారం కావడం లేదని అన్నారు. స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని, తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేలా చేస్తానన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి నోటీసులు ఇచ్చిన భయపడాల్సిన అవసరం లేదని, స్థానికులకు తాను అండగా ఉంటానని అన్నారు.
READ ALSO: Allu Arjun: స్టాఫ్‌తో కలిసి ఐకాన్ స్టార్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్..