రాహుల్ గాంధీ.. తెలంగాణ టూర్ పై బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ స్పందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చెయ్యని పనులు ఇప్పుడు చేస్తామంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదని అన్నారు. కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు.. రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైందని సెటైర్ వేశారు.
అధికారం ఉన్నచోట కోల్పోతున్న కాంగ్రెస్, ప్రజలను మభ్య పెడుతోందని డా.లక్ష్మణ్ పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే తెలంగాణ రైతులకు, నిరుద్యోగులకు మేలు జరిగిందని కొనియాడారు. టీఆర్ఎస్ తో పొత్తుల చరిత్ర కాంగ్రెస్ దే అని అన్నారు. టీఆర్ఎస్ తో బిజెపి ఏనాడు పొత్తు పెట్టుకోలేదు, పెట్టుకోదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు ఓటేసినా టీఆర్ఎస్ కె చెల్లుతుందిని అన్నారు. గెలిచిన వాళ్ళందరూ మూకుమ్మడిగా టీఆర్ఎస్ లో చేరటం ఖాయమని స్పష్టం చేశారు.
వృధా ప్రయాసతో రాహుల్ సభలు నిర్వహిస్తున్నారని అన్నారు. గెలిపించిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పార్టీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక గూటి పక్షులే అని అన్నారు. బిజెపిని ఎదుర్కునేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్, మజ్లీస్ లు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. రాజ్యాంగ సంస్థల్లో కేంద్రం జోక్యం ఉండదని, ఎవరయినా అవినీతికి పాల్పడితే చట్ట రీత్యా ఆయా సంస్థలు చర్యలు తీసుకుంటాయని కె. లక్ష్మణ్ అన్నారు.
Minister KTR: రైతులందరికీ పాదాభివందనం- మంత్రి కేటీఆర్