ఈ ఏడాది యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6,832 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన ధాన్యం దిగుబడికి అనుగుణంగా ఇప్పటి వరకు 30 జిల్లాల్లో 5299 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం నాటికి 76,495 మంది రైతులనుంచి రూ. 1483 కోట్ల విలువ చేసే 7.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు ఆయన వెల్లడించారు.…
తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్లో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. నెటిజన్ల విజ్ఞప్తులకు వెంటనే స్పందించడమే కాదు.. అప్పుడప్పుడు తానే ‘ఆస్క్ కేటీఆర్’ పేరిట ప్రజలతో ముచ్చటిస్తారు. వారి సమస్యల్ని తెలుసుకొని, అప్పటికప్పుడే పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తారు. ఈరోజు కూడా ఆయన ట్విటర్లో లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టాలీవుడ్ నిర్మాత మధుర శ్రీధర్ ఓ ప్రశ్న సంధించారు. తెలుగు వినోద రంగానికి ప్రపంచస్థాయి ఫిలిం స్కూల్/యూనివర్సిటీ అవసరం ఉందని, తద్వారా హైదరాబాద్‌ను భారతీయ చిత్ర రంగానికి…
కేటీఆర్ మాటలు గురివింద సామెత లెక్క ఉన్నాయన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గాంధీ కుటుంబం తో పోల్చుకునే ప్రయత్నం చేస్తారు టీఆర్ఎస్ వాళ్ళు. దేశ స్వాతంత్య్రం కోసం జైలుకు వెళ్ళిన కుటుంబం గాంధీ కుటుంబం అన్నారు రేవంత్.
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఆస్క్ కేటీఆర్ (Ask KTR) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ట్విటర్ వేదికగా కేటీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తెలంగాణలో మరోపార్టీకి అవకాశం లేదని, మూడోసారి కూడా టీఆర్ఎస్సే గెలుస్తుందన్నారు కేటీఆర్. అభివృద్ధి కొనసాగిస్తాం. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిని బీజేపీ అమ్ముకుంటోంది. బీజేపీ అసలు స్వరూపం ఇదే. బీజేపీ అంటే బేచో జనతాకి ప్రాపర్టీ. గ్యాస్ ధరల్లో…
తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. బీజేపీ నేతల్ని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శిస్తే… బీజేపీ నేతలు తామేం తక్కువ తినలేదన్నట్టుగా మాటల దాడి చేస్తున్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్ ముంపు వాసుల నుంచి భూములు లాక్కుని, పునరావాసం, పరిహారం ఇవ్వలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ ఎక్కడుందని అడుగుతున్న టీఆర్ఎస్ నేతలకు ఇక్కడికొచ్చిన జనమే సమాధానమని తెలిపారు. ఉదండాపూర్ ప్రాజెక్టు పనులేమయ్యాయని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్…
24వ రోజు ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఆయన జడ్చర్ల నియోజకవర్గం నక్కలబండ తండాకు చేరుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్లు కుక్కల్లా మొరుగుతున్నారు.. ఎంతైనా మొరగండి.. జడ్చర్ల ప్రజలకు న్యాయం చేయండని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ పేదలు ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న ఇళ్ల స్థలాలను కేసీఆర్ ధరణి పేరుతో లాక్కుంటూ నిలవనీడలేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్న టీఆర్ఎస్ నేతలు.. గుంట నక్కల్లా ఇసుక, మట్టి,…
* నేడు కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన. 9గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకోనున్న పవన్ కళ్యాణ్. రోడ్డు మార్గంలో సిరువెళ్ల వెళ్లనున్న పవన్ * మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు *పుట్టపర్తిలో నేడు CPI కార్యాలయాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ * గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రెండవ రోజు కొనసాగనున్న వైఎస్ఆర్సీపీ జాబ్ మేళా. *ఉదయగిరిలో వై.ఎస్.ఆర్.సున్నా వడ్డీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి…ఎం.ఎల్.ఏ.మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి *ఆత్మకూరులో…
పిల్లలను కిడ్నాప్ చేస్తారు.. కొద్ది రోజులు పెంచుతారు.. లోకం పోకడ తెలియగానే.. బిచ్చగాళ్లుగా మారుస్తారు.. ఆరు నెలల పసికందుపై కన్నేసిన ఇద్దరు మాయలేడీలు.. బాలునితో బిక్షాటన చేయించాలని పథకం రచించి.. సికీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. తల్లి ఒడికి దూరమైన 24 గంటల వ్యవధిలో నిజామాబాద్ పోలీసులు కేసును చేధించి.. కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. పసికందును తల్లి ఒడికి చేర్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని.. వినాయక్ నగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మి -కిషన్ దంపతులు భిక్షాటన చేస్తూ..…
టెర్రరిస్టులు ఆదిలాబాద్ ను సేఫ్ జోన్ గా భావిస్తున్నారా? పోలీసులను పక్కదారి పట్టించేందుకే ఆదిలాబాద్ పేరెత్తుకున్నారా? ఇంతకీ ఆదిలాబాద్ లొకేషన్ ఎందుకు చెప్పారనే దానిపై నిఘా వర్గాల ఆరా ముమ్మరం అయింది. వాస్తవంగా ఖలిస్తాన్ కు ఇక్కడ నెట్ వర్క్ ఉందా? ఉంటే ఎవ్వరు…స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయా? ఎన్నో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముందే పసిగట్టలేదా? ఇంతకీ హర్యానాలో పట్టుబడ్డ ఉగ్ర ముఠా ప్లానేంటి? కేంద్ర నిఘా సంస్థల దర్యాప్తు ఎక్కడికొచ్చింది..రాష్ట్ర పోలీస్ విభాగం…