ప్రధాని మోదీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మోదీ జీ.. మీరు గుజరాత్ కే కాదు భారత దేశానికి కూడా ప్రధాని అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎనిమిదేండ్లుగా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేయలేదన్నారు. కేంద్రం చర్యతో వైద్య విద్యకు దూరమయ్యే యువత పరిస్థితి ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణపై వివక్ష ఎందుకు? అని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే గుజరాత్లో జరిగిన ఓ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరై…
★ నేడు కోనసీమ జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన.. ఐ.పోలవరం మండలం మురమళ్ళలో వైఎస్సార్ మత్య్సకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్ ★ చిత్తూరు: నేడు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు మూడో రోజు పర్యటన.. ఈరోజు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్న చంద్రబాబు ★ తిరుమల: నేడు డయల్ యువర్ ఈవో కార్యక్రమం ★ అనంతపురం: నేటి నుంచి పెన్న అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ★ నెల్లూరు: నేడు వెంకటాచలంలో గడప…
కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ఈ మధ్య తెలంగాణలో కేఏ పాల్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే కాగా.. ఢిల్లీ వెళ్లిన ఆయన ఈ వ్యవహారంపై కూడా ఫిర్యాదు చేసినట్టుగా చెబుతున్నారు. అమిత్‌షాతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన పాల్.. తెలంగాణలో జరుగుతున్న అవినీతి అన్యాయం అక్రమాలు నా జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు.. అమిత్ షాతో అనేక విషయాలను చర్చించాను.. కేసీఆర్ అవినీతి, కేటీఆర్ అక్రమాలు, కేసీఆర్…
ఏం తినేటట్లు లేదు.. ఏం కొనేటట్లు లేదు అన్నట్లు ప్రస్తుత పరిస్థితి ఉంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, వంట నూనెల ధరలు పెరిగి సామాన్యులను అష్టకష్టాలు పెడుతున్నాయి. అయితే తామేం తక్కువ కాదు అన్నట్లు చికెన్ ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. మార్కెట్లో కిలో చికెన్ ధర రికార్డులు తిరగరాస్తోంది. ఏపీలోని విశాఖపట్నంలో కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.312కు చేరి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. అటు తెలంగాణలో కిలో స్కిన్…
తెలంగాణ నుంచి ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు గురువారం నోటిఫికేషన్ వెలువడనున్నది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్లు స్వీకరించనున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాటుచేశారు. ఈ నెల 30న ఎన్నిక జరుగనున్నది. రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాశ్ తన పదవికి రాజీనామా చేయటంతో ఈ ఖాళీ ఏర్పడింది. ఈ స్థానంలో ఎన్నికయ్యే అభ్యర్థి పదవీ కాలం 2024, ఏప్రిల్ 2తో ముగుస్తుంది. బండా ప్రకాశ్ ఇటీవల…
ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నవరాత్రోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు సహస్ర కలశాభి షేకం వైభవంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు బొజ్జ రమేష్‌శర్మ, సామవేద పండితులు ముత్యాలశర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు శ్రీ స్వామి వారలకు పురుషసూక్త, శ్రీ సూక్త, కల్పోక్త, వ్యాసపూర్వక, శోడషోపచార పూజ, సహస్ర నామార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పంచోపనిషత్తులచే మన్యసూక్త, రుద్రాభి షేక పూజలు, సహస్ర కలశాభి షేకం, ప్రత్యేక పూజలు, అర్చనాది ఆరాధన, హారతి…
★ నేడు సీఎం జగన్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ★ చిత్తూరు: నేడు కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటన.. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న చంద్రబాబు.. శీగలపల్లె ఆలయాన్ని సందర్శించనున్న చంద్రబాబు ★ ఏపీలో నేడు ఇంటర్ సెకండియర్ మ్యాథ్స్ పరీక్ష ★ తిరుమల: నేటితో ముగియనున్న పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు.. నేడు గరుడ వాహనంపై ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకోనున్న శ్రీవారు ★ నెల్లూరు: నేడు బిట్రగుంటలో డిప్యూటీ…
సీడబ్ల్యూసీకి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది.. కేంద్ర జలసంఘంలోని ప్రాజెక్టు అప్రైజల్ డైరెక్టరేట్ కు లేఖ రాశారు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్.. కర్ణాటక చేపట్టిన అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు అనుమతులపై అభ్యంతరం వ్యక్తం చేశారు.. ఆ రెండు ప్రాజెక్టులకు అనుమతులు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.. అంతర్ రాష్ట్ర అంశాలు, ట్రైబ్యునల్ తీర్పులను పరిగణనలోకి తీసుకోకుండా అనుమతులు ఇవ్వరాదని సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళ్లింది తెలంగాణ.. రెండు ప్రాజెక్టులకు అనుమతులతో కృష్ణాకు తుంగభద్ర నుంచి ప్రవాహాలు…
రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో టీ డయాగ్నోస్టిక్ మినీ హబ్‌ను, మొబైల్ యాప్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంజీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తుందని ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. త్వరలోనే వైద్యారోగ్య శాఖలో 13 వేల నియామకాలు చేపడుతామన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే…
యాదాద్రి భువనగిరి జిల్లాలో మహిళపై అత్యాచారం చేసి, హత్య చేసిన హంతకుడిని 24 గంటల్లో అరెస్ట్ చేశారు చౌటుప్పల్ పోలీసులు. వివరాల్లోకి వెళితే…చౌటుప్పల్ (మం) తూప్రాన్ పేటలో అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న మహిళ పై గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేశారు. అనంతరం విషయం బయటకు పొక్కకుండా ఆమెను హత్య చేశారు. ఈ ఘటన సంచలనం కలిగించింది. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన కృష్ణ నాయక్ ,లావణ్య దంపతులు బతుకు తెరువు కోసం తూప్రాన్ పేటకు వచ్చారు.…