దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 3,207 కేసులు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా 29 మంది చనిపోయారు. మరో 3410 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. కోలుకున్నవారి సంఖ్య 98.74 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.05 శాతంగా ఉంది. దేశంలో మొత్తం కరోనా కేసులు 4,31,05,401గా నమోదయ్యాయి. మొత్తం మరణాలు 5,24,093గా నమోదయ్యాయి.
దేశంలో యాక్టివ్ కేసులు 20,403గా వున్నాయి. దేశంలో కోలుకున్నవారి సంఖ్య 4,25,60,905కి చేరింది. ఇదిలా వుంటే దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఆదివారం 13,50,622 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్డోసుల సంఖ్య 1,90,34,90,396కు చేరింది. ఆదివారం ఒక్కరోజే 3 లక్షల 36 వేలకుపైగా కరోనా టెస్టులు నిర్వహించింది కేంద్రం. ఇటు ప్రపంచదేశాల్లో కరోనా బీభత్సం కలిగిస్తోంది. కొత్తగా మొత్తం 3 లక్షలకుపైగా కేసులు వెలుగుచూశాయి. మరో 600 మందికి పైగా మరణించారు. చైనాలోనూ కరోనా ఉధృతి కొనసాగుతోంది.