★ తిరుమల: ఈరోజు తరిగొండ వెంగమాంబ 292వ జయంతి ఉత్సవాలు.. సాయంత్రం 5 గంటలకు నారాయణగిరి ఉద్యానవనానికి ఉరేగింపుగా చేరుకోనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి ★ విశాఖ: నేడు విశాఖ కనెక్ట్ అండ్ టూరిజం మెగా మీట్.. పాల్గొననున్న మంత్రి అమర్నాథ్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, టూరిజం, ట్రావెల్స్ రంగ సంస్థలు ★ విశాఖలో నేడు బీచ్ క్లీన్ డ్రైవ్.. స్వచ్ఛ సముద్ర తీరం కార్యక్రమంలో పాల్గొననున్న నేవీ, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్జీవోలు ★…
https://www.youtube.com/watch?v=u1ixNl-A5hQ ఆదివారం ఏ రాశివారు ఏం చేయాలి? ఏ కార్యక్రమాలు చేస్తే ఫలితాలు ఎలా వుంటాయి. ద్వాదశ రాశులకు సంబంధించి గ్రహచారం, మంచీచెడు గురించి శ్రీరాయప్రోలు మల్లిఖార్జున శర్మ రాశిఫలాలు అందిస్తారు. ఆ రాశిఫలాలు ఎలా వున్నాయో ఈ వీడియోలో చూద్దాం.
ఓ మహిళ అవసరాన్ని అవకాశంగా తీసుకున్నాడో పై అధికారి.. ఆమెకు కావాల్సిన సంతకం పెడుతానన్నాడు.. కానీ.. ఓసారి మీ ఇంటికి వస్తా.. నా కోరిక తీర్చు అనడంతో ఖంగుతిన్న ఆమహిళ కొండంత బాధతో పై అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో మార్చి 30న జరుగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘పని, బిల్లులిచ్చే విషయంలో నిన్ను ఏడాదికాలంగా ఇబ్బంది పెట్టాను. అదంతా మరిచిపో. నిన్ను ఉద్యోగంలో కొనసాగించే దస్త్రం మీద సంతకం చేస్తా. నువ్వు…
హైదరాబాద్ లో చాలామంది ఆఫీస్ లకు, స్కూల్స్, కాలేజ్, ఇతరత్రా పనుల నిమిత్తం వెళ్ళేవాళ్ళు ఎక్కువగా బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు వెళ్లిన పని ఆలస్యమైతే బస్సులు ఉండవని కంగారు పడుతుంటారు. అయితే ఇక నుంచి కంగారు పడాల్సిన అవసరం లేదని టీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఉన్న రూట్లలో అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ బస్సులు డిపోలకు…
అనుమానం పెనుభూతం అయింది.. కడదాకా కలిసి ఉంటానని వేదమంత్రాల సాక్షిగా ప్రమాణం చేసిన భర్త ఆమె పాలిట మృత్యువుఅయ్యాడు. భార్యపై అనుమానంతో చున్నీతో మెడ బిగించి భార్యను దారుణంగా హత్య చేశాడు. సఖ్యతగా ఉంటారని అనుకుంటే.. తన కూతురును నమ్మించి హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తల్లిదండ్రుల వివరణః పెళ్లయిన కొద్ది రోజులకే కాపురంలో కలతలు వచ్చాయి.. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు కూడా పెరిగాయి… భర్త వేధింపులు భరించలేక ఆ నవ వధువు…
తెలంగాణలో రెండు జిల్లాల ప్రజల చిరకాల వాంఛ వంతెన నిర్మాణం కలగానే మిగిలిపోతుంది. గోదావరి పై బ్రిడ్జ్ నిర్మిస్తే ఆ రెండు జిల్లాల వాసులకు ప్రయాణ దూర భారం తగ్గడమే కాకుండా సులభతరం అవుతుందని భావించిన వారందరికి నిరాశే ఎదురవుతుంది. బ్రిడ్జ్ నిర్మాణం కోసం మట్టి పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఆనందాలు వెల్లివిరిసినా ఐదేళ్ళు అవుతున్నా వంతెన ఊసే లేదని స్థానికులు వాపోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి- మంచిర్యాల జిల్లాల మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మాణంతో రవాణా…
వారాంతాల్లో ఎంఎంటీఎస్ సేవల్లో కోత విధించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ నేపథ్యంలో ఇవాళ, రేపు 34 సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది . మొత్తం 16 సర్వీసులు నడుస్తుండగా… అందులో 34 సర్వీసులు అంటే సగం వరకూ సర్వీసులను రద్దు చేసినట్టయ్యింది. ఆయా రైళ్ల రద్దు వివరాలను నగరంలోని అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లలో అందుబాటులో ఉంచుతున్నారు. రద్దైన మార్గాలుః లింగంపల్లి – హైదరాబాద్ మధ్య 18 సర్వీసులు రద్దయ్యాయి. ఫలక్ నుమా…
మంత్రి కేటీఆర్ నేడు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ తాగునీటి సరఫరా కోసం సుంకిశాలలో జలమండలి నిర్మించనున్న ఇనెటెక్ వెల్‌కు పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 9.45 గంటలకు పెద్దవూర మండలం సుంకిశాలకు చేరుకుంటారు. హైదరాబాద్ నగరానికి త్రాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేస్తున్న ఇన్‌టెక్ వెల్ పంపింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఉదయం 10.45 గంటలకు నందికొండ మున్సిపాలిటీకి…
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణలో తమ పార్టీదే ఆధిపత్యం అంటున్నారు పాల్. కాంగ్రెస్ పని అయిపోయిందని, ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేసేది ప్రజాశాంతి పార్టీయే అన్నారు ఆ పార్టీ చీఫ్ కేఏ పాల్. రాబోయే ఎన్నికలపైనే తాను ఫోకస్ పెట్టానంటున్నారు. ఆ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటు స్థానం మినహా ఏపీ, తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ భారత రాష్ట్రాలతోపాటు…