Nalgonda:దారుణం.. భార్యను చున్నీతో కడతేర్చిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుమానం పెనుభూతం అయింది.. కడదాకా కలిసి ఉంటానని వేదమంత్రాల సాక్షిగా ప్రమాణం చేసిన భర్త ఆమె పాలిట మృత్యువుఅయ్యాడు. భార్యపై అనుమానంతో చున్నీతో మెడ బిగించి భార్యను దారుణంగా హత్య చేశాడు. సఖ్యతగా ఉంటారని అనుకుంటే.. తన కూతురును నమ్మించి హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
తల్లిదండ్రుల వివరణః
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
పెళ్లయిన కొద్ది రోజులకే కాపురంలో కలతలు వచ్చాయి.. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు కూడా పెరిగాయి… భర్త వేధింపులు భరించలేక ఆ నవ వధువు మెట్టినింటి గడప దాటింది. పుట్టింటికి చేరుకుంది. భర్త వేధింపుల విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అల్లుడి వేధింపులను గమనించిన అత్త మామ అల్లుడు కుటుంబ సభ్యులు ఒకసారి పిలిచి సఖ్యత గా ఉండాలని సూచించారు. మంచి చూసుకొవాలని వేడుకున్నారు.
మరోసారి కూతుర్ని అల్లుడు చేతిలో పెట్టి పంపించారు. కొన్నాళ్లు సాఫీగానే సంసారం సాగింది. హైదరాబాద్ కు ఉపాధి కోసం వెళ్తున్నానని చెప్పారు. కానీ ఎక్కడ ఉంటున్న విషయం అత్తమామలకు అల్లుడు శంకర్ చెప్పలేదు. దీంతో అల్లుడిపై అత్తామామలకు అనుమానం వచ్చింది.
కానీ నిన్న మధ్యాహ్నం కూతురు అల్లుడు ఫోన్ చేసారు భాగానే ఉన్నామని చెప్పారు. త్వరలోనే తిరిగి ఇంటి వస్తామని చెప్పారు… సంసారం సాఫీగా సాగుతుందని సంతోషంగా ఉన్నామని చెప్పడంతో సంబరపడ్డారు. కానీ మరోసారి మాట్లాడే ప్రయత్నం చేయడంతో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పలుమార్లు మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. కొద్ది సేపటికే స్థానిక శంకరంపేట పోలీసుల నుంచి ఫోన్ వచ్చిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు మృతురాలి బంధువులు.
అనుమానంః
భార్య సఖ్యతగా ఉండకపోవడంతో అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చున్నీతో గొంతు బిగించి హత్య చేశారు. ఈ ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలోని పున్నమి లాడ్జిలో చోటుచేసుకుంది.
అసలేం జరిగింది?
మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన ముదావత్ శంకర్… అదే జిల్లా శంకర్ పల్లి కి చెందిన శిరీష తో ఫిబ్రవరి లో వివాహం జరిగింది. కొద్దిరోజులుగా వారిద్దరూ నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ లో జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనులకు కూలీలుగా వచ్చారు. వివాహం అయినప్పటి నుండి శిరీష తన భర్తతో సఖ్యతగా ఉండకపోవడంతో అనుమానం పెంచుకున్న ఆమె భర్త శంకర్ ఆమెను నల్లగొండకు తీసుకువచ్చి లాడ్జిలో గదిఅద్దెకు తీసుకుని ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ శుక్రవారం సాయంత్రం వరకు గొడవపడినట్లు తెలుస్తోంది. గొడవ నేపథ్యంలోనే ఆమెను మెడను చున్నీతో బిగించి శంకర్ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసిన అనంతరం భర్త పోలీసులకు లొంగి పోయినట్లు తెలుస్తోంది. ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ఇప్పటికే సమాచారం అందించగా మృతదేహాన్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్చరీకి తరలించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!