నగరంలో ఇకపై 24 గంటలు బార్లు, రెస్టారెంట్లు, పబ్బులలో మద్యం అనుతించబడదని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల, ప్రతినిధుల దృష్ట్యా ఐదంతస్తుల రేటింగ్ ఉన్న హోటల్‌కు 24 గంటలు మద్యం అనుమతి ఉంటుందని తెలిపారు. అయితే, అది సాధారణ ప్రజలకు కాదని, ఆయా హోటల్స్‌లో ఉండే పర్యాటకులకు మాత్రమేనని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిన్నపాటి లాభాల కోసం నిబంధనలు ఉల్లంఘిస్తూ హైదరాబాద్‌కు అపఖ్యాతి తీసుకురావద్దని…
తెలంగాణలో (Telangana) ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ (BJP) చూస్తోంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ (TRS) వైఫల్యాలను ఎండగడుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. తెలంగాణలో బలపడటానికి బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi sanjay) కూడా ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. గ్రామ గ్రామాలు తిరిగి టీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణ బీజేపీ నాయకులకు అండగా బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్…
*ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి తిరుమల పర్యటన. ఇవాళ శ్రీకాళహస్తీర్వుడి దర్శనం, తిరుపతి గంగమ్మకు సారెని సమర్పించనున్న స్వామీజీ. * నేడు రాయలసీమ యూనివర్శిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కు పిలుపు. రాయలసీమ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఆనందరావు ను రీకాల్ చేయాలని డిమాండ్ *నేడు రాజ్ భవన్ ను ముట్టడించనున్న రాయలసీమ విద్యార్థి సంఘాలు. అనుమతులు లేవు ఆంక్షలు అతిక్రమిస్తే అరెస్ట్ చేస్తాం…
ఇవాళ నృసింహ జయంతి సందర్భంగా ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీరు అన్నీ శుభాలను పొందుతారు. నిత్యం మీలో ఏర్పడే సంఘర్షణకు ముగింపు లభిస్తుంది. మీ కుటుంబం సుఖసంతోషాలతో వుంటారు. https://www.youtube.com/watch?v=3LfIHZ3P75g
బీజేపీకి రాజీనామా చేసి మంత్రి సబితా రెడ్డి సమక్షంలో బిజెపి సర్పంచ్ అనిత శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీలో చేరారు. బిజెపి సర్పంచ్ అనిత శ్రీనివాస్ ను టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సాదరంగా ఆహ్వానించారు. శ్రీనగర్ కాలనీలోని మంత్రి నివాసంలో పెద్ద ఎత్తున అనుచరులతో టి ఆర్ ఎస్ లో చేరిన బీజేపీ సర్పంచ్ ను టి ఆర్ ఎస్ కండువా కప్పి సాధారంగా పార్టీలోకి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆహ్వానించారు. ఈ…
అసలే ఎండలతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కరీంనగర్ నగర వాసులకు నీటి కష్టాలు చుక్కలు చూపిస్తున్నాయి. నగరంలోని అనేక డివిజన్ లలో ప్రజలు నీటి అవసరాలు తీర్చుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు.పట్టించుకోవాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ శివారు గ్రామాలు తాగునీటి సమస్యతో సతమతం అవుతున్నాయి. బిల్లులు సకాలంలో చెల్లించడం లేదనే కారణంతో మిషన్ భగీరథ పనులను గుత్తేదారులు నత్తనడకన చేపట్టడంతో జనాలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. శివారు గ్రామాలను నగరపాలక…
ఏజెన్సీ లే టార్గెట్ గా విత్తన కంపెనీలు మోసాలకు తెగిస్తున్నాయి. అమాయక ఆదివాసీ రైతులను లక్కీ డ్రా ల పేరుతో చీట్ చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్దంగా అడ్వాన్స్ బుకింగ్ చేయడంతో పాటు బహుమతులంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో విత్తన కంపెనీల మాయాజాలానికి, మోసాలకు రైతులు బలవుతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నకిలీ విత్తనాలు ఏటా రైతులను నిండాముంచుతున్నాయి. అందమైన బ్రోచర్లు, ఆకట్టుకునే విధమైన కరపత్రాలు ,దృష్టి మరల్చే విధమైన పేర్లతో రైతులను తమ వైపు తిప్పుకుంటున్నారు.…
నేటి నుంచి యాదాద్రిలో మూడు రోజులపాటు లక్ష్మీ నరసింహస్వామి జయంత్యుత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో గీత తెలిపారు. అనుబంధ పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంతోపాటు దబ్బగుంటపల్లిలోని యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సంభోద్భవుడైన నరసింహస్వామి జయంత్యుత్సవాలకు శుభఘడియాలు వచ్చేస్తున్నాయి. ఈ సంబరం నిర్వహణకు ఆచార్య బృందం.. ఆలయ యంత్రాంగం సంసిద్ధమైందని తెలిపారు. పునర్ నిర్మితమైన పంచనారసింహుల దివ్యాలయంలో నారసింహుడి జయంత్యుత్సవాలు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు విష్వక్సేన ఆరాధనతో మొదలవుతాయని ఈవో గీత,…
హైదరాబాద్ నగరంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో రూ.5కే భోజనం అందించే పథకం మొదలైంది. రోగులతోపాటు ఆస్పత్రులకు వచ్చే సహాయకుల కోసం ఉద్దేశించిన ఈ పథకాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి ఒకేరోజు 18 ఆస్పత్రుల్లో ప్రారంభించడం విశేషం. నగరంతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి నిత్యం ఎంతోమంది ప్రజలు వైద్యం కోసం రాజధానిలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తుంటారు. ప్రతి రోగి వెంట వారి బాగోగులు చూసుకోవడానికి కుటుంబసభ్యులు వస్తుంటారు. ఇలాంటివారికి నామమాత్రపు ఖర్చుతో భోజనం అందించడం ఈ పథకం…